N. T. Rama Rao: సాంఘిక చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న రోజులు అవి. సీనియర్ హీరోలు ‘ఎన్టీఆర్, ఏఎన్నార్’ పని అయిపోయిందని కామెంట్స్ ఎక్కువ అవుతున్న రోజులు అవి. మరోపక్క సాంఘిక చిత్రాలలో కృష్ణ, శోభన్ బాబు తిరుగులేని స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కానీ, నటనలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా ఎన్టీఆర్ కి ఉన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఎన్టీఆర్ కి తన పని పట్ల ఉన్న నిబద్దత గురించి కూడా చెప్పక్కర్లేదు.
పనిని దైవంగా భావిస్తారు ఎన్టీఆర్. ఒకసారి షూటింగ్ కి వచ్చాక, ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సీన్లు కంప్లీట్ చేశాకే ఇంటికి వెళ్లేవారు ఎన్టీఆర్. ఒక్కోసారి ఫైట్స్ లో నటిస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కి దెబ్బలు తగిలేవి. అయినా.. ఏమాత్రం పట్టించుకోకుండా పనిని పూర్తి చేసేవారు. అయితే, అది 1977లో ఎదురీత అనే సినిమా షూటింగ్ జరుగుతున్న కాలం.
Also Read: ‘రాధేశ్యామ్’ రివ్యూ : సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే
ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ ఘటన అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వి.మధుసూదనరావు దర్శకత్వంలో ఏన్టీఆర్ హీరోగా వాణిశ్రీ హీరోయిన్ గా మొదలైంది ఈ సినిమా. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. కాగా ఈ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించాడు. ఆ రోజు ఉదయమే షూటింగ్ మొదలైంది.
రన్నింగ్ షాట్స్ తీస్తున్నారు. కెమెరా టీం రన్ చేస్తూనే షూట్ చేయాలని ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ – కైకాల పరుగు అందుకున్నారు. కరెక్ట్ గా ఆ సమయంలోనే ఓ
ఇనుప రాడ్డు ఎన్టీఆర్ ముఖానికి బలంగా తగిలింది. రక్తం బొట్లు బొట్లుగా కారిపోతుంది. అది చూసిన అందరూ కంగారు పడుతూ ఎన్టీఆర్ వద్దకు పరుగు అందుకున్నారు.
వెంటనే షూటింగ్ ఆపి ఎన్టీఆర్ తో పాటు అందరూ బడ్డుకు వచ్చేశారు. ఆ ఒడ్డు పక్కన మిరప తోట ఉంది. పక్కన మిరపకాయలు కోసి ఎండబెట్టారు. వాటిని చూసిన ఎన్టీఆర్ వెంటనే.. కొన్ని మిరపకాయలు తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ కనిపించాడు. పక్కన ఉన్న వాణిశ్రీ ఎన్టీఆర్ చేస్తున్న పనికి అలాగే నోరెళ్ళబెట్టి చూసింది.
ఎన్టీఆర్ నాలుగు మిరపకాయలు స్పీడ్ గా నమిలేసి.. ‘పదండి షూటింగ్ చేద్దామని ముందుకు సాగారు. నెప్పిని భరించడానికి ఎన్టీఆర్ మిరపకాయలు తిని షూట్ చేశారు. అది ఎన్టీఆర్ అంటే.
Also Read: భీమ్లానాయక్ 11వ రోజు కలెక్షన్స్.. మళ్లీ మైండ్ బ్లాంక్