Andhra Pradesh Assembly budget session: ఏపీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం చాలా హుందాగా కనిపించింది. అంతేగానీ ఎక్కడా కూడా వివాదాస్పద అంశాల జోలికిపోకుండా.. కేవలం చెప్పాలనుకున్నది స్పష్టంగా వివాద రహితంగా చెప్పేసినట్టు తెలుస్తోంది. అయితే మొన్న కోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల అంశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆ పని చేయలేదు.

మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెట్టేసి వికేంద్రీకరణ అంటూ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం మూడేండ్లుగా వికేంద్రీకరణ విధానాన్ని చేపడుతోందని ప్రకటించుకోవడం అన్నమాట. మొన్న కోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో దీనిమీద చర్చించాలని వైసీపీ భావించింది. ఇందులో భాగంగానే గవర్నర్ ప్రసంగంలో కూడా అది ఉంటుందని అంతా ఊహించారు.
Also Read: తెలంగాణ బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు
కానీ నేరుగా మూడు రాజధానుల అంశాన్ని తీయకపోవడంతో.. కోర్టు తీర్పుపై చర్చకు ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలా చేస్తో కోర్టుపై నేరుగా దాడి చేసినట్టే అవుతుందని అన్ని వర్గాల నుంచి వాదనలు రావడంతో.. ఈ విషయంలో వెనకడుగు వేసింది జగన్ ప్రభుత్వం. అయితే గవర్నర్ మాత్రం వికేంద్రీకరణ మీద ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు చెబుతున్నారు.

అదే సమయంలో గవర్నర్ ఇతర అంశాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. నవరత్నాలు, జీఎస్టీ వృద్ధి, తలసరి ఆదాయం, భద్రతా పరమైన అంశాలు, పారిశ్రామిక పెట్టుబడులు అంటూ చాలా అంశాలపై ప్రభుత్వానికి అనుకూలంగా మార్కులు వేస్తూ మాట్లాడారు. చూస్తుంటే.. జగన్‌కు, గవర్నర్‌కు మంచి సత్సంబంధాలే ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ ఏదైనా అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నారో.. అదే గవర్నర్ నోటి నుంచి రావడం ఇక్కడ గమనార్హం. ఇక్కడే జగన్ వేస్తున్న ప్లాన్ గురించి చెప్పుకోవాలి. ఎలాగూ మూడు రాజధానుల అంశాన్ని అటు రాష్ట్రంలో చర్చించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని అభివృద్ధి అంశాల నుంచి మూడు రాజధానుల అంశాల వైపు మళ్లించి తనకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలని కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు అసెంబ్లీలో కోర్టు తీర్పుపై చర్చించకూడదని భావిస్తున్నారంట.
Also Read: కేంద్రం, గవర్నర్ సపోర్టు లేకుండా కేసీఆర్ ఆ పని చేయగలరా.. అసలు ప్లాన్ వేరే ఉందా..?