Virender Sehwag- David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పేరు తెలియని వారుండరు. ఇతడి గురించి తెలియని వారు కూడా ఉండరనే తెలుస్తోంది. ఇతడు తాగితే అంతే. రచ్చ రచ్చే. అది బారైనా స్టేడియమైనా ఎదుటి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు. దారుణంగా ప్రవర్తిస్తాడు. ఆట కంటే పార్టీలకే ప్రాధాన్యత ఇస్తాడు. ప్రాక్టీసులను ఎగ్గొట్టి పార్టీలకు వెళుతుంటాడు. క్రమశిక్షణా రాహిత్యం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి పరిస్థితినైనా అవలీలగా తీసుకోవడం అతడికి అలవాటు.

అతడి గురించి మాజీ టీమిండియా సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. 2009లో ఐపీఎల్ లో ప్రవేశించిన వార్నర్ మొదట ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహించేవాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ అభిమానులకు వార్నర్ అంటే అమితమైన అభిమానం. కానీ అతడి ప్రవర్తనతోనే అందరు విసిగిపోయేవారు. డ్రెసింగ్ రూంలో అందరితో గొడవ పడేవాడు. జట్టుకు తలనొప్పులు తెచ్చేవాడు. దీంతో అతడిని ఎలాగైనా దూరం చేయాలనే ఆలోచనలో మిగతా సభ్యలు ఉండేవారు.
Also Read: Russia Ukraine Crisis: రష్యా దూకుడును తగ్గించుకుంటుందా?
దీంతో వార్నర్ ను ఎలాగైనా తొలగించుకోవాలనే ఉద్దేశంతో టీం మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా రెండు మ్యాచులు ఉండగానే అతడిని స్వదేశానికి పంపేశారు. వార్నర్ దూకుడుగా ప్రవర్తించేవాడు. అందరితో గొడవలకు దిగేవాడు. 2013 ఇంగ్లండ్ పర్యటనలో ఒక బార్ లో తాగిన మైకంలో ఒకరిపై చేయి చేసుకోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

ఇలా అతడి జీవితమంతా వివాదాలే. ఎక్కడ చూసినా విమర్శలే. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలంటేనే భయం ఉండేది. ఈ నేపథ్యంలో వార్నర్ గురించి అందరికి తెలిసిందే. అతడి విచిత్ర ప్రవర్తనతోనే అందరిలో కలివిడిగా ఉండేవాడు కాదు. దీంతో రోజు గొడవలే అతడి దినచర్యగా ఉండటంతో సహచర సభ్యులు తలలు పట్టుకునేవారు. అతడి వేధింపులకు నిలిచేవారు కాదు. అలాంటి డేవిడ్ వార్నర్ గురించి సెహ్వాగ్ వివరించాడు.
Also Read:Balakrishna- Sai Pallavi: బాలకృష్ణ, సాయిపల్లవి యాడ్ లలో నటించకపోవడానికి కారణాలేంటి?