KTR- Congress Party: కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏవోవో ఊహించుకుంటోంది. దానితో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు ఎంపీగా గెలవని రాహుల్ ఇక్కడ పార్టీని ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. రైతుల గురించి డిక్లరేషన్ ఇచ్చినా దాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరు. దేశంలో తక్కువ ఆత్మహత్యలున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటుంది.
కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరు కూడా ధైర్యం చేయరు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ. అందులో ప్రయాణంచేయడానికి ఇష్టపడరు. అందుకే వారు ఏవో పొత్తులపై వారి ాలోచనలో భాగంగా మాట్లాుడుతున్నారే కానీ దాంతో పొత్తుకు ఎవరు తయారుగా లేరనే విషయం తెలిసుకోవాల.ి అంతేకాని రాష్ట్రంలో మేమే నెంబర్ వన్ అనే పొజిషన్ లో మాట్లాడటం వారి తెలివితక్కువ తనానికి నిదర్శనం.
Also Read: Russia Ukraine Crisis: రష్యా దూకుడును తగ్గించుకుంటుందా?
ఇక రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రోస్ కు లేదు. వారి హయాంలో ఎరువుల కోసం ఎన్ని తంటాలు పడ్డారో తెలిసిందే. అలాంటి పార్టీ రైతులకు ఏదో చేస్తుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్ముతారా? వారి పాలనలో రైతులు ఎంత కష్టాలు పడ్డారో వారికే తెలుసు. ఇప్పుడొచ్చి మేం అది చేస్తాం ఇది చేస్తామని బీరాలు పలికితే నమ్మే గొర్రెలు లేరు. ఎవరో రాసిన స్క్కిప్టును చదవివ రాహుల్ కు ఇక్కడి సమస్యలు ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
రైతులకు రుణమాఫీచేశాం. రైతుబంధు ఇస్తున్నాం. రైతు బీమా కూడా ఇస్తున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇన్ని చేస్తున్నా ఇంకా రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కార్చడం వారి వివేకానికి నిదర్శనమే. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా చేశాం. వారికి ఏం కావాలన్నా ఇచ్చాం. ఇప్పుడొచ్చి కాంగ్రెస్ పార్టీ కట్టు కథలు చెబితే నమ్మే స్థితిలో ఎవరు లేరని తెలుసుకోవాలి. డిక్లరేషన్ తో ఏం లాభం లేదని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాలకు రాహుల్ తలాడిస్తూ గొర్రెలా వెళ్తున్నారని విమర్శలు చేశారు.
Also Read:Chandrababu Comments On Allainces: త్యాగాల రాజకీయం.. రండి వైసీపీని ఢీకొడదాం.. చంద్రబాబు ఐక్యతారాగం!!