https://oktelugu.com/

Russia Ukraine Crisis: రష్యా దూకుడును తగ్గించుకుంటుందా?

Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు భీకర పోరు సాగుతూనే ఉంది. రష్యా దురాక్రమణలో మురియుపాల్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. తన ఆనవాళ్లు కోల్పోయిందది. అక్కడ స్టీల్ ప్లాంట్ తప్ప అన్ని శిథిలమయ్యాయి. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. రష్యా దాడితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే నగరం పూర్తిగా ధ్వంసమైంది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు రష్యా మొదటి మేరియుపాల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2022 / 03:49 PM IST
    Follow us on

    Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు భీకర పోరు సాగుతూనే ఉంది. రష్యా దురాక్రమణలో మురియుపాల్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. తన ఆనవాళ్లు కోల్పోయిందది. అక్కడ స్టీల్ ప్లాంట్ తప్ప అన్ని శిథిలమయ్యాయి. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. రష్యా దాడితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే నగరం పూర్తిగా ధ్వంసమైంది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు రష్యా మొదటి మేరియుపాల్ నగరంపై బాంబులతో విరుచుకుపడుతోంది.

    Russia Ukraine Crisis

    స్టీల్ ప్లాంట్ లో 200 మంది పౌరులున్నట్లు తెలుస్తోంది. అందుకే వారిని రక్షించుకోవడానికి సైన్యం రక్షణగా నిలిచింది. రష్యా మాత్రం ఫైరింగ్ ఆపడం లేదు. దీంతో పౌరులను తరలించడం కష్టంగా మారింది. అయినా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైనిక చర్యలతో రష్యా ఉక్రెయిన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయినా వారు మాత్రం భయపడటం లేదు. పుతిన్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నారు.

    Also Read: Heroine Madhavi Biography: తెలుగు ఇండస్ట్రీనే కొనే స్థాయికి ఎదిగిన తెలుగు హీరోయిన్ !

    ఇప్పటికైనా రష్యా సేనల్ని ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డిమాండ్ చేస్తున్నారు. శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడంతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నా రష్యా పెడచెవిన పెడుతోంది. దీంతోనే యుద్ధంతో అందరిని బాధలకు గురిచేస్తోంది. యుద్ధం వల్ల ప్రపంచమే నష్టపోతోంది.

    Russia Ukraine Crisis

    ఇప్పటివరకు 5.5 మిలియన్ ఉక్రెయిన్ వాసులు సొంత స్థలాలను వీడి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. రష్యాకు చెందిన 24 వేల మంది సైనికుల్ని అంతం చేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును తగ్గించుకుని ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ రష్యా మాత్రం వినిపించుకోవడం లేదు. ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు. కొందరు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. దీనికి రష్యా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

    Also Read:Balakrishna- Sai Pallavi: బాలకృష్ణ, సాయిపల్లవి యాడ్ లలో నటించకపోవడానికి కారణాలేంటి?

    Tags