Celebrity Hairstylist India: సాధారణంగా హెయిర్ కటింగ్ చేయించుకుంటే.. రూ 100 లేదా రూ. 150 చెల్లిస్తూ ఉంటాం.. మిగతా అవసరాలకు కలిపి మరింత మొత్తాన్ని చెల్లిస్తాం.. కానీ హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఎవరైనా రూ. లక్ష చెల్లిస్తారా? కానీ ఒక్కసారి సాధారణ హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఇక్కడ మాత్రం అక్షరాల లక్ష రూపాయలు చెల్లించాలి. ఇంకా డిజైన్ కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సిందే. ఇంతకీ లక్ష రూపాయలు పెట్టి హెయిర్ కటింగ్ ఎవరు చేయించుకుంటున్నారో తెలుసా?
Also Read: రామ్ చరణ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?
ఆలీమ్ హకీం.. ఈ పేరు సాధారణ వ్యక్తులకు తెలియకపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీకి మాత్రం ఈ పేరు సుపరిచితమే. ఎందుకంటే ఇతను హెయిర్ కటింగ్ చేస్తే అదిరిపోవాల్సిందే. కొందరు హీరోలు లుక్ రావడానికి ఈయన చేసే హెయిర్ కటింగ్ అని కొనియాడుతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు మాత్రమే కాకుండా క్రికెటర్స్.. ఇతర ప్రముఖులు కూడా ఇతని వద్ద హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.
వాస్తవానికి అలీం హకీమ్ రూ.20 తో కటింగ్ ప్రారంభించాడు అన్న విషయం చాలామందికి తెలియదు. తాను 9 ఏళ్ల వయసు ఉన్న సమయంలో వాళ్ల నాన్న చనిపోయాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. అయితే ఈ సమయంలో ఆ కుటుంబం దగ్గర కేవలం రూ.13 మాత్రమే ఉన్నాయి. దీంతో అతడు తన ఫ్యామిలీని పోషించడానికి హెయిర్ కటింగ్ చేయడం ప్రారంభించారు. హెయిర్ కటింగ్ చేసి షాంపుతో క్లీన్ చేయడానికి.. రూ. 30 తీసుకునేవాడు. అలా రకరకాల డిజైన్లు చేసి అందరిని హలీమ్ హకీమ్ ఆకట్టుకున్నాడు.
Also Read: బాలీవుడ్ సౌత్ దర్శకుల వెంట ఎందుకు పడుతోంది..?
క్రికెటర్ విరాట్ కోహ్లీ తన హెయిర్ కటింగ్ హలీమ్ హకీమ్ వద్దే చేయించుకుంటాడు. అంతేకాకుండా ఇతను హెయిర్ కటింగ్ చేస్తేనే తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని విరాట్ కోహ్లీ మన సందర్భాల్లో చెప్పాడు. తాను హెయిర్ కటింగ్ సెట్ చేయించనందుకు లక్షా 16 వేల రూపాయలు చెల్లిస్తున్నాడు. అలాగే ధోని హెయిర్ స్టైల్ కూడా హలీమ్ హకీమ్ సెట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతని ప్రతిభ చూసి చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రశంసించారు. ప్రముఖ సౌత్ ఇండస్ట్రీ నటుడు రజినీకాంత్ ఇతని ప్రతిభను చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. తన లైఫ్ లో జరిగిన జర్నీ గురించి రజినీకాంత్ తో చెప్పడంతో ఆయన ఎంతో ప్రత్యేకంగా అభినందించాడు. అంతేకాకుండా ఆయన నటిస్తున్న కూలీ సినిమా కోసం ఈయన పనిచేస్తున్నాడు.
అయితే హలీమ్ హకీమ్ లక్షల రూపాయల ఫీజు తీసుకుంటున్నా.. ఇతని వద్ద హెయిర్ స్టైల్ కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ సెట్ చేయించుకొని రూ. రెండు లక్షల వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
హలీమ్ హకీమ్ వద్ద తెలుగు హీరోలు కూడా హెయిర్ స్టైల్ చేయించుకుంటారు. వీరిలో రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు ఉన్నారు.