BCCI Virat Kohli: ఏ ముహూర్తాన కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారో గానీ.. అప్పటి నుంచి కోహ్లీ వర్సెస్ బీసీసీఐ వార్ మొదలయింది. ఏ చిన్న ఘటన జరిగినా సరే కోహ్లీ అభిమానులు బీసీసీఐను టార్గెట్ చేస్తున్నారు. అయితే బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కోహ్లీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధిస్తున్నాయి. దాంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.

ఇప్పుడు ఇలాంటి అగ్గి రాజేసింది బీసీసీఐ. అదేంటంటే మార్చి 4న ఇండియా, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచులు స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో తొలిటెస్టు కోహ్లీకి 100వ టెస్టు మ్యాచ్ కానుంది. స్టార్ క్రికెటర్లకు 100వ మ్యాచ్ అంటే వారి అభిమానులకు ఎంత ప్రత్యేకమో తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పెద్ద దెబ్బేసింది.
ఈ మ్యాచ్‌ను మొదట్లో బెంగళూరులోని చిన్ని స్వామి స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది. చిన్న స్వామి స్టేడియం అంటే కోహ్లీకి హోమ్ గ్రౌండ్ లాంటిది. అతను ఐపీఎల్ లో బెంగుళూరు తరఫున ఇక్కడే ఎక్కువ మ్యాచులు ఆడుతున్నాడు. దాంతో అతనికి ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే ఇక్కడ జరగాల్సిన తొలి మ్యాచ్‌ను సడెన్ గా మొహాలికి మార్చేసింది బీసీసీఐ.
Also Read: ఆ ముగ్గురు ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్ ఇవ్వబోతున్నారా.. ఉగాది తర్వాత ఖాయమే..!
ఇక రెండో టెస్టును మాత్రం బెంగుళూరులో నిర్వహిస్తామని చెప్పింది. సరేలే అనుకునే లోపే మరో వార్త కోహ్లీ అభిమానులకు మండేలా చేస్తోంది. అదేంటంటే.. తొలి టెస్టు మ్యాచ్‌కు మొహాలీ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేది లేదని స్టేడియం నిర్వాహకులు చెప్పేశారు. దాంతో ప్రేక్షకుల మధ్యలో 100వ మ్యాచ్ ఆడాలనుకున్న కోహ్లీకి ఈ రకంగా షాక్ తగిలింది.
కాకపోతే రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న చిన్న స్వామి స్టేడియంలోకి మాత్రం అభిమానులను 50శాతం అనుమతిస్తామని కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు. కానీ అది కోహ్లీకి 101వ మ్యాచ్ అవుతుంది. మొత్తానికి ఇలా బీసీసీఐ అనుకోకుండా చేసిన పనులు కూడా కోహ్లీ అభిమానులకు టార్గెట్ అవుతూనే ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
[…] India vs Sri Lanka: టీమిండియా అప్రతిమ విజయయాత్ర కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా విజయాల పరంపరలో దూసుకుపోతోంది. వెస్టిండీస్, శ్రీలంక లను వైట్ వాష్ చేసి ఇండియాకు ఎదురులేదని నిరూపిస్తోంది. గతంలో జరిగిన చేదు అనుభవాల నేపథ్యంలో టీమిండియా చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ఆటల్లో దూసుకుపోయేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే శ్రీలంకతో జరిగిన టీ20 మూడో మ్యాచ్ లోనూ దాన్ని ఓడించి వైట్ వాష్ చేయడం తెలిసిందే. […]