CM Jagan: చాలా రోజులుగా వైసీపీ నేతలను టెన్షన్ పెడుతున్న విషయం ఏదైనా ఉందా అంటే అది మంత్రి వర్గ విస్తరణ అనే చెప్పుకోవాలి. రెండున్నరేండ్ల పాలన పూర్తయిన తర్వాత మార్పు ఉంటుందని జగన్ ముందు చెప్పారు కాబట్టి.. ఇదిగో ఇప్పుడు ఉంటుంది. లేదు లేదు అప్పుడు ఉంటుంది అంటూ ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి.

కాగా ఈ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. దాంతో మంత్రులుగా ఉన్న వారిలో టెన్షన్ పెరుగుతుంటే.. పదవి కోసం ఆశిస్తున్న వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. ఈ ఉగాది తర్వాత కచ్చితంగా మార్పు ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఇందులో ఓ ఇద్దరు కీలక మంత్రులకు షాక్ ఇస్తారని తెలుస్తోంది. తాము జగనకు అత్యంత సన్నిహితులం, తమకే ప్రాబ్లమ్ లేదని చెప్పుకునే పేర్ని నాని, కొడాలి నానితో పాటుగా వెలంపల్లి శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలకు కూడా షాక్ తప్పదని సమాచారం. ప్రస్తుతం వీరంతా జగన్ మీద ఎవరు విమర్శలు చేసినా రంగంలోకి దిగి గట్టిగానే జవాబిస్తున్నారు.
ఇక జగన్ మెప్పు పొందేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. మంత్రి పదవి తమకు ముఖ్యం కాదని, జగన్ వద్ద ఉంటే చాలంటూ చెబుతున్నారు. కానీ కొన్ని సార్లు వారు చేస్తున్న పనులు పార్టీకి పెద్ద నష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కొడాలి నానికి చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాల వారిని కించపరిచేలా మాట్లాడటం, అలాగే కేసినో వ్యవహారంతో పాటు, వంగవీటి రాధాకు గన్‌మెన్లు ఇప్పించి తర్వాత తిరస్కరించేలా చేయడం ఇవన్నీ తీవ్ర విమర్శలు తీసుకు వచ్చాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఇక ఆయనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస రావు అలాగే పేర్ని నానిల అనవసర దూకుడు పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుందని జగన్ గ్రహించారంట. గౌరవ మంత్రి పదవిలో ఉండి వారు ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వానికి మచ్చ వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారంట. అయితే వారి దూకుడు ప్రభుత్వ పరంగా కాకుండా.. పార్టీ పరంగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
పార్టీ కీలక బాధ్యతలను వారికి అప్పగించి తన వ్యూహాలను అమలు చేసుకోవాలని భావిస్తున్నారంట. కాగా జగన్ ఎలాంటి నిర్ణయం అయినా నాన్చకుండా తీసేసేకుంటారు కాబట్టి.. వీరి విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి ఉగాది తర్వాత ఈ మంత్రుల పరిస్థితి ఏంటనేది తెలయనుంది.
Also Read: నాగబాబుపై రోజా సెటైర్లు.. భీమ్లా నాయక్‌ను ప్రభుత్వం తొక్కేయలేదంట..!
[…] […]