Zodiac Signs: ఏ రాశి వారి ఇల్లు ఎటువైపు ఉండాలి? ప్రధాన ద్వారం ఎటు ఉంచుకోవాలంటే?

మేష రాశి వారికి తూర్పు ద్వారం శుభ ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశి వారికి దక్షిణ ద్వారం కలిసి వస్తుంది. మిథున రాశి వారికి పశ్చిమ ద్వారం ఉంటే జీవితంలో వారు దేన్నయినా సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఉత్తర ద్వారం బాగా ఉంటుంది. సింహ రాశి వారికి తూర్పు ద్వారం మంచి ఫలితాలు కలగజేస్తుంది. కన్యా రాశి వారికి పశ్చిమ ద్వారం బాగుంటుంది.

Written By: Srinivas, Updated On : June 23, 2023 1:00 pm

Zodiac Signs

Follow us on

Zodiac Signs: మనం వాస్తును నమ్ముతాం. ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కా వాస్తు ప్రకారం ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఇంటికి ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైనది. అది రాశులను బట్టి ఉంటుంది. ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన విధంగా ప్రధాన ద్వారం ఉంచుకునే వెసులుబాటు ఉంటుంది. ద్వాదశ రాశుల్లో మనిషికో రకంగా ప్రధాన ద్వారం ఉండేలా వాస్తు చెబుతోంది.

మేష రాశి వారికి తూర్పు ద్వారం శుభ ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశి వారికి దక్షిణ ద్వారం కలిసి వస్తుంది. మిథున రాశి వారికి పశ్చిమ ద్వారం ఉంటే జీవితంలో వారు దేన్నయినా సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఉత్తర ద్వారం బాగా ఉంటుంది. సింహ రాశి వారికి తూర్పు ద్వారం మంచి ఫలితాలు కలగజేస్తుంది. కన్యా రాశి వారికి పశ్చిమ ద్వారం బాగుంటుంది.

తుల రాశి వారికి దక్షిణ ద్వారం మంచిదని చెబుతారు. వ‌ృశ్చిక రాశి వారికి ఉత్తర ద్వారం బాగా ఉంటుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారికి తూర్పు ద్వారం బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారికి దక్షిణ ద్వారం మంచి ఫలితాలు ఇస్తుంది. కుంభ రాశి వారికి పశ్చిమ ద్వారం బాగుంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీన రాశి వారికి ఉత్తర ద్వారం బాగా కలిసొస్తుంది.

ఇలా వివిధ రాశుల వారికి వారి జాతక రీత్యా ఇంటి ప్రధాన ద్వారం ఉంచుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. దీని వల్ల మనకు జీవితంలో అనుకున్నది సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈనేపథ్యంలో ఇంటి ప్రధాన ద్వారం విషయంలో మన జాతకం ప్రకారం మనకు ఎలాంటి ద్వారం ఉండాలో చూసుకుని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.