Women Face Reading: చాలా మంది చేతి రేఖల ఆధారంగా వ్యక్తుల జాతకం చెబుతుంటారు. కొందరు కాలి రేఖల ఆధారంగా జాతకం చెబుతారు. ఇంకొదరు.. నుదుటి రేఖలు చూసి భవిష్యత చెప్పేస్తుంటారు. కానీ ఇక్కడ కేవలం ఫొటో చూసి వారు మోసం చేసేవారా కాదా అని చెప్పేస్తున్నారు. అందులో చాలా వరకు వాస్తవం ఉండడం గమనార్హం. అయితే ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకమట.
ఫొటో చూసి..
మొహం చూడగానే.. వారు చీట్ చేసే రకమా, కాదా అనే అంచనా వేసే కళ ఆడవాళ్లకు సహజంగానే ఉందంటోందట. అయితే ఈ అధ్యయనం నిజం అని కాదు కానీ, తమ పార్ట్ నర్ తమకు చీట్ చేస్తుంటే మాత్రం మగువలు చాలా తేలికగానే గ్రహించగలరనేది వాస్తవం. దీని కోసం పెద్ద అధ్యయనాలు అక్కర్లేదు. మగాడి ప్రవర్తనే అతడిని వారికి పట్టించేస్తుందని సామాజిక పరిస్థితులను బట్టి తేలికగా చెప్పొచ్చు. మొహం చూడగానే వారు చీటరో కాదో చెప్పగలిగే శక్తి ఉందనిపై అధ్యయనం చెబుతోంది. అయితే ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మగువలు తమ భర్త వ్యవహారం గురించి ఓ కన్నేసేందుకు తేలికగానే ఉన్నాయి.
ఆకస్మిక మార్పులు!
మగవాడు కొత్త పరిచయం కోసమో, పాత పరిచయాన్ని బయటెక్కడో కంటిన్యూ చేసే క్రమంలో తన షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పులను చేసుకుంటూ ఉంటాడు. ప్రత్యేకించి వర్క్‌ఫ్రమ్ హోం పద్ధతిలో ప్రపంచం కొనసాగుతున్న తరుణంలో.. మగవాడి షెడ్యూల్ లో ఈ ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవడం చాలా వరకూ అతడిని పట్టించే అంశమే. ఆఫీసు లేకపోయినా బయటకు వెళ్లడం, ఇంట్లో ఉండే సమయం తగ్గిపోవడం.. అతడి యాక్టివిటీస్ గురించి మగువ దృష్టి పెట్టే ఆసక్తిని పెంచుతుంది.
ఎమోషనల్ డిస్టెన్స్..
అంతకు ముందుతో పోలిస్తే ఇద్దరి మధ్యన చర్చించే అంశాలు క్రమంగా తగ్గిపోతాయి. మాట్లాడుకోవడం తగ్గిపోతోంది. ఏం జరుగుతోందో పరస్పరం చెప్పుకోవడం కానీ, అందుకు సంబంధించి ఎమోషనల్ రియాక్షన్స్ పెద్దగా లేకుండా పోతుంది. ఈ ఎమోషనల్ డిస్టెన్స్ పెరగడం ఆడవారి అనుమానాలు బలపడేందుకు కారణం అవుతుంది.
ఆన్‌లైన్ యాక్టివిటీస్..
విపరీతంగా ఫోన్‌లో వాట్సాప్ వంటి యాప్స్ వినియోగం, ఆ పై అన్నింటికీ పాస్‌వర్డ్ లు సెట్ చేసుకోవడం లేదా, పాస్‌వర్డ్‌లు మార్చేయడం, కంప్యూటర్ పాస్‌వర్డ్ ఎవరికీ తెలియనీయకపోవడం, వాట్సాప్‌లో నిరంతరం కనిపిస్తూ ఉండటం, చాట్ హిస్టరీలు డిలీట్ చేయడం.. ఇది జరుగుతున్న విషయం దాస్తే దాగేదేమీ కాదు. ఇలాంటివి అనుమానాలను మరింతగా పెంచుతాయి.
కొత్త ఖర్చులు!
భర్త ఖాతాలో కనిపించే అన్యూజువల్ స్పెండింగ్స్ కూడా ఆడవాళ్లలో అనుమానాలకు తావిచ్చే అవకాశాలున్నాయి. కాఫీ డే బిల్లులో, ఖరీదైన గిఫ్ట్ కొన్న బిల్లులో మెసేజ్‌ల రూపంలో అతడి మొబైల్‌లో కనిపిస్తే.. మరెవరితోనో గడుపుతున్నాడనేందుకు ఆధారాలు అవుతాయి. ఇవి ఆమె కంట పడినప్పుడు తగిన వివరణ ఇచ్చుకోలేకపోతే మాత్రం అడ్డంగా దొరికిపోయినట్టే!
తమ పార్ట్‌నర్ చీట్ చేస్తున్నాడనేందుకు ఈ అంశాలను ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఆధారాలుగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వేలో చెబుతున్నట్టుగా మొహం చూడగానే పట్టేయలేకపోయినా.. ఇలాంటి అంశాలు మాత్రం పట్టించేందుకు, పట్టుకునేందుకు ఆస్కారాన్ని కలిగి ఉన్నాయి.