https://oktelugu.com/

Fridge Tips: ఫ్రిజ్ లో ఏ పండు ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసా?

పైనాపిల్ ను ఫ్రిజ్ లో 3-5 రోజులకు మించి ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే దానిలో హానికర కెమికల్స్ పెరిగిపోయి పండు పనికి రాకుండా పోతుంది. సపోటాలు 5-7 రోజులు మాత్రమే ఉంచుకోవాలి. వీటిని ఇంకా కాస్త కావాలంటే పది రోజుల పాటు ఉంచుకోవచ్చు. అంతకు మించి ఉంచితే అవి కూడా పాడవుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 23, 2023 5:22 pm
    Fridge Tips

    Fridge Tips

    Follow us on

    Fridge Tips: మన ఆరోగ్య సంరక్షణలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం తెచ్చుకున్న పండ్లను ఫ్రిజ్ లో పెట్టేసి ఇక వాటిని గురించి పట్టించుకోం. కానీ అలా చేస్తే వాటి పోషక విలువలు తగ్గుతాయి. ఒక్కో పండును ఫ్రిజ్ లో ఎంత కాలం నిలువ ఉంచుకోవచ్చో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పండు అందులోనే ఉంచితే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఏ పండును ఎంత కాలం ఫ్రిజ్ లో ఉంచుకోవాలో తెలుసుకుంటే మంచిది.

    మన ఆరోగ్య సంరక్షణలో బొప్పాయి ముందుంటుంది. ఇందులో ఉండే పోషకాలతో మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో సాయపడుతుంది. బొప్పాయిని ఫ్రిజ్ లో 5 నుంచి 7 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకు మించి రోజులు ఉంచితే అది పాడైపోతోంది. దాని లోపల ఉండే పదార్థం పనికి రాకుండా పోతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి.

    పైనాపిల్ ను ఫ్రిజ్ లో 3-5 రోజులకు మించి ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే దానిలో హానికర కెమికల్స్ పెరిగిపోయి పండు పనికి రాకుండా పోతుంది. సపోటాలు 5-7 రోజులు మాత్రమే ఉంచుకోవాలి. వీటిని ఇంకా కాస్త కావాలంటే పది రోజుల పాటు ఉంచుకోవచ్చు. అంతకు మించి ఉంచితే అవి కూడా పాడవుతాయి.

    మామిడి పండ్లను రెండు వారాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆ సమయం దాటితే అవి కూడా కుళ్లిపోతాయి. తినడానికి వీలు కాకుండా అవుతాయి. దానిమ్మ పండ్లు మాత్రం నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. కట్ చేసినవి మాత్రం రెండు మూడు రోజుల్లోనే చెడిపోతాయి. పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడితే రెండు వారాలకు మించి ఉంచకూడదు. ఎక్కువ రోజులు ఉంచితే పాడవుతుంది.

    స్ట్రాబెర్రీలను 3 నుంచి 5 రోజుల వరకు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే పనికి రాకుండా పోతాయి. ఆపిల్ 3-4 వారాలుంటాయి. ఆఫ్రికాట్ 4-5 రోజులు మాత్రమే ఉంటాయి. బ్లూబెర్రీలు 1-2 వారాలు మాత్రమే పాడుకాకుండా ఉంటాయి. ఉసిరి రెండు మూడు రోజులే ఉంటాయి. ద్రాక్ష 5-7 రోజులు, జామ 3-4 రోజులు, కివీ 5-7 రోజులు, నారింజ 2-3 వారాలు నిల్వ చేసుకోవచ్చు.