Negative Energies: మనం వాస్తు పద్ధతులు పాటిస్తాం. కుటుంబంలో ఆనందం నిండాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా వాస్తు నియమాలు పాటించాల్సిందే. వాస్తు సరిగా లేకపోతే దాని ప్రభావం మనుషులపై పడుతుంది. వాస్తు చిట్కాలు పాటిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకుంటే ఎలాంటి ముప్పు రాకుండా ఉంటుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు మెరుగుపడుతుంది.
ఇంటి ప్రవేశద్వారం
ఇంటి ప్రవేశ ద్వారానికి ఎంతో శక్తి ఉంటుంది. మన ఇంట్లోకి ఏది రావాలన్నా ప్రధాన ద్వారమే ఆధారం. అందుకే ప్రవేశ ద్వారం తలుపు వెలుతురులో ఉండాలి. తలుపు ముందర ఎలాంటి చెత్త చెదారం ఉండకూడదు. పాదరక్షలు కూడా అక్కడ విడువ కూడదు. తలుపునకు అడ్డంగా ఏదీ ఉండరాదు. ఒక వేళ ఉంటే ఇంట్లోకి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.
రంగు
లైటు కలర్ లో ఉండే విధంగా రంగులు ఉండాలి. ప్రశాంతతను కలిగించే రంగులను ఎంచుకోవాలి. ప్రకాశవంతమైన రంగులను వేసుకోవాలి. చపలతను కలిగించే రంగులు వేసుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో కూడా సానుకూల శక్తులు రావాలంటే మృదువైన లైటింగ్ ఉంచుకోవడం సురక్షితం. సహజ కాంతి ఉత్తమమైనదిగా గుర్తించాలి.
మొక్కలు
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇండోర్ లో మొక్కలు పెంచడం బాగుంటుంది. పడక గదిలో మొక్కలు ఉంచుకోకూడదు. బెడ్ రూంలో మొక్కలు ఉంటే నిద్రకు భంగం కలుగుతుంది. బయట పెంచుకుంటేనే మంచిది.