Vastu Tips
Vastu Tips: చిన్నపిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా వీరిని ఇష్టపడుతారు. ఒకవేళ పసిపిల్లలు ఉన్నారంటే ఆ ఇల్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంతోషం, ఆనందం, అల్లరి అన్ని ఉంటాయి. కానీ పిల్లల ఎదుగుదలకు మాత్రం కాస్త శ్రద్ద వహించాల్సిందేనట తల్లిదండ్రులు. మరి వాస్తు ప్రకారం ఎలాంటి శ్రద్ద తీసుకోవాలో తెలుసుకోండి.
రాతి ఉప్పుకు పర్యావరణం నుంచి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే సహజ సామర్థ్యం ఉంటుంది. అందుకే రాతి ఉప్పును ఒక గాజు గిన్నెలో పెట్టి, గదిలో ఒక మూలకు ఉంచాలి. 10-12 గంటల తర్వాత దీన్ని తీసివేయాలి. ఇలా ప్రతి రోజు చేస్తే నవజాతి పిల్లలకు దిష్టితగలదు. వాస్తు ప్రకారం నవజాతి శిశువుల పడకగది ఈశాన్య దిశలో ఉండాలి. అది కుదరకపోతే ఉత్తర, తూర్పు దిశల్లో ఉంచిన మంచి ఫలితాలు ఉంటాయట. ఈ దిశలు పిల్లల పెరుగుదల, అభివృద్దికి దోహదపడతాయంటున్నారు వాస్తు నిపుణులు.
చిన్నారుల పడకగదిలో గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండాలట. ఉదయపు సూర్య కిరణాలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. ఇవి శిశువు గదిలో ప్రసరిస్తే, సూక్ష్మక్రిములను నిర్మూలిస్తాయి. పిల్లల తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో వారు బాగా నిద్రిస్తారు. వాయువ్య దిశ గాలి మూలకానికి సంబంధించినది. అందుకే ఇంట్లో ఈ దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో పిల్లలకు శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. వీరి దుస్తులు, బెడ్ షీట్లు ఎప్పుడు ఒక క్రమ పద్దతిలో ఉంచాలి. వీటిని నైరుతి దిశలో ఉంచడం మంచిది.
చిన్నారుల పడుకునే మంచానికి ఎదురుగా అద్దం ఉంచకూడదట. దీనివల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందట. ఇక ఊయల గోడ నుంచి రెండు, మూడు అడుగుల దూరంలో ఉంచాలట. వీరి ఆహ్లాదంగా ఉంచాలట. శాంతి, ఆధ్యాత్మికత, స్ఫూర్తిదాయకంగా ఉండే ఫోటో ఫ్రేమ్స్, పూల మొక్కలు ఏర్పాటు చేసుకోవాలి. పొద్దు తిరుగుడు పూలు పిట్యూటరీ గ్రంథిని యాక్టివేట్ చేస్తాయి. ఇలాంటివి ఇంట్లో ఉంటే మానసికంగా డెవలప్ మెంట్ ఉంటుంది అంటున్నారు వాస్తు నిపుణులు.