Poonam Kaur: యూజ్ లెస్ ఫెలో… పవన్ కళ్యాణ్ ఫేవరేట్ డైరెక్టర్ ని నేరుగా తిట్టేసిన పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ చేసిన కామెంట్ త్రివిక్రమ్ ని ఉద్దేశించే అని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఈసారి నేరుగా పేరు పెట్టి తిట్టేసింది. త్రివిక్రమ్ ని 'యూస్ లెస్ ఫెలో' (పనికిరాని వాడు) అనేసింది.

Written By: S Reddy, Updated On : February 22, 2024 3:51 pm

Poonam Kaur

Follow us on

Poonam Kaur: ఓ స్టార్ డైరెక్టర్ ని నేరుగా పేరు పెట్టి తిట్టింది పూనమ్ కౌర్. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటి పూనమ్ కౌర్ సినిమాల్లో కంటే వివాదాలతో ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా పూనమ్ ఘాటైన కామెంట్స్ చేస్తుంది. ముఖ్యంగా ఆమె దర్శకుడు త్రివిక్రమ్ ని తరచుగా టార్గెట్ చేస్తుంది. టీచర్స్ డే రోజు బండ్ల గణేష్… గురూజీ అంటూ త్రివిక్రమ్ ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది. ఎవరిని పడితే వాళ్ళను గురూజీ అని పిలిచి, ఆ పదానికి ఉన్న గౌరవం తగ్గించకండి… అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది.

పూనమ్ కౌర్ చేసిన కామెంట్ త్రివిక్రమ్ ని ఉద్దేశించే అని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఈసారి నేరుగా పేరు పెట్టి తిట్టేసింది. త్రివిక్రమ్ ని ‘యూస్ లెస్ ఫెలో’ (పనికిరాని వాడు) అనేసింది. పవన్ కళ్యాణ్ భీమవరంలో జనసేన నాయకులతో మాట్లాడుతూ.. జగన్ సిద్ధం అంటున్నాడు. నేను యుద్ధం అంటాను. సినిమాల్లో కూడా నాకు పంచ్ డైలాగ్స్ చెప్పడం ఇష్టం ఉండదు. అత్తారింటికి దారేది మూవీలో సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అనే డైలాగ్ నీకు చెప్ప బుద్ధి కాలేదు.

త్రివిక్రమ్ కోసం ఏదో కామెడీగా ఆ డైలాగ్ చెప్పాను… అన్నారు. ఈ వీడియోను ఓ మీడియా సంస్థ ట్విట్టర్ లో షేర్ చేసింది. సదరు వీడియో మీద పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యింది. యూస్ లెస్ ఫెలో #త్రివిక్రమ్ అని కామెంట్ చేసింది. నేరుగా త్రివిక్రమ్ ని పేరు పెట్టి తిట్టిన పూనమ్ తీరుకు అందరూ షాక్ అవుతున్నారు. పూనమ్ ఎందుకు త్రివిక్రమ్ ని తిట్టినట్లు అని వాపోతున్నారు. త్రివిక్రమ్ ఫ్యాన్స్ పూనమ్ మీద మండిపడుతున్నారు.

పూనమ్ కౌర్ 2006లో విడుదలైన మాయాజాలం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. శౌర్యం, వినాయకుడు వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. 2022లో వచ్చిన నాతిచరామి ఆమె చివరి చిత్రం. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్… రాహుల్ గాంధీతో పాటు పాదయాత్ర చేసింది. పూనమ్ కౌర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.