Vastu Tips: మనం ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి. దీంతో తమ జీవితం ఎప్పుడు బాగుపడుతుందో అని ఆశగా ఎదురుచూస్తుంటారు. మన కష్టాలు తొలగిపోవాలంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు కారణాలు ఏంటనే దానిపై ఆలోచనలో పడిపోతుంటారు. రుణబాధల నుంచి విముక్తి పొందాలని ప్రయత్నిస్తుంటారు. దీని కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాల్సిందే.

ఇంట్లో ఉత్తర దిశలో ఏవైనా వాస్తు దోషాలున్నాయేమో చూసుకోవాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కావడంతో సంపద రావాలన్నా ఖర్చులు అధికం కావాలన్నా అతడిదే భారం. దీంతో అప్పులవ్వడం జరుగుతుంది. ఉత్తరం వైపు ఫర్నిచర్, భారీ వస్తువులను పెట్టినా నష్టాలు రావడం సహజం. ఉత్తర దిక్కును క్లీన్ గా ఉండేలా చూసుకోవడం మంచిది. దక్షిణం గోడ కొంచెం ఎత్తుగా ఉత్తరం గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఉంటి నిర్మాణం చేసే సమయంలో ఉత్తర దిశను పూర్తిగా మూసి దక్షిణ దిశను ఖాళీగా ఉంచినా కష్టాలు వస్తాయి.
నైరుతి దిశలో భూగర్భ ట్యాంకు ఉన్నా అప్పులు వేధించే అవకాశాలున్నాయి. ఈశాన్య దిశలో ఎలాంటి యంత్రాలు ఉంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్య దిశలో ఎలాంటి యంత్ర పరికరాలు ఉంచడం శ్రేయస్కరం కాదు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకుంటే చాలు. దిక్కుల్లో ఏదైనా పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఎటు వైపు ఏది ఉంచితే ఫలితం ఉంటుంది. లేకపోతే ఏది పెడితే ఎలాంటి ముప్పు ఏర్పడుతుందనే విషయాలు తెలుసుకుని మసలుకోవాలి.

వాస్తు శాస్త్రం రీత్యా మన ఇల్లుకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. పక్కా వాస్తు పాటించాలి. అప్పుడే మనకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉత్తరం, ఈశాన్యం దిక్కుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వంట గది ఆగ్నేయ దిక్కులో, పడక గది నైరుతి దిశలో ఉంటే వాస్తు సమస్యలు రావు. దీంతో వాస్తును పండితుల చేత చూపించుకుని సమస్యలు తలెత్తకుండా చేసుకోవాలి. లేదంటే వాస్తు సమస్యలు మనల్ని కష్టాలకు గురి చేయడం ఖాయం. అది చిన్నదైనా పెద్దదైనా ఏ వస్తువు ఎక్కడ ఉంచాలనే విషయం వాస్తు ప్రకారం చూసుకోవడం ఉత్తమం.