Vastu Tips: వాస్తు టిప్స్ : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. అవెంటో తెలుసా?

పండుగల వేళ, ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. ఇవి ఇంటికి కట్డడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు లోపలికి రాకుండా ఆపుతాయి. అయితే ఇవి ఎండిపోయినా కూడా అలాగే ఉంచుతారు.

Written By: Chai Muchhata, Updated On : September 29, 2023 11:21 am

Vastu Tips

Follow us on

Vastu Tips: జీవితంలో సుఖ శాంతులతో జీవించాలంటే వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్మాలి అని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో సంతోషం ఉండదు. అలాగే అలా వచ్చిన డబ్బు.. ఇలా వెళ్లిపోతుంది. అందుకు కారణాలేవి అని తెలియక ఆవేదన చెందుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారా కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. మరి ఆ వస్తువులేవీ అని తెలుసుకుందామా.

మామిడి తోరణాలు:
పండుగల వేళ, ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. ఇవి ఇంటికి కట్డడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు లోపలికి రాకుండా ఆపుతాయి. అయితే ఇవి ఎండిపోయినా కూడా అలాగే ఉంచుతారు. అలా చేయడం వల్ల కొత్త బ్యాక్టీరియా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఎప్పటికప్పడు మామాడితోరణాలను సాధ్యమైనంతగా మారుస్తూ ఉండాలి. అలాగే మామిడి తోరణాలు ఇంటిపై ఎవరైనా చెడు దృష్టితో చూసినా దానిని అరికడుతుంది. దీంతో ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

పూలు, నీళ్లు..
ఒక గిన్నెలలో నిండుగా నీరు పోసి అందులో పూలు వేసి ఇంట్లోప్రధాన ద్వారం వద్ద దీనిని ఉంచాలి. అయితే ఇది ఎవరి కాలుకు తగలకుండా ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి. ఇలా వేసి ఉంచడం వల్ల ఇంట్లో వచ్చేవారి మనసు ఉల్లాసంగా మారుతుంది. అంతేకాకుండా చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ వస్తువు పెట్టడం వల్ల వేడి, విద్యుత్ వాహకాలను కంట్రోల్ చేస్తుంది. దీంతో ఇంట్లో వారికి ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా వారి మధ్య ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది.

లక్ష్మీ పాదాలు:
ఇంట్లో డబ్బు నిలవడానికి లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటాయి. కానీ అ అమ్మవారు అనుగ్రహం పొందడానికి కొన్ని పనులు చేయాలి. లక్ష్మీ పాదాలను ఇంటి ప్రధాన ద్వారా ఇరు వైపులా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంటిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో వారి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది.

స్వస్తిక్ సింబల్:
ఏదైనా పూజ ప్రారంభించేటప్పుడు ఓంకారం తో పాటు స్వస్తిక్ సింబల్ ను పసుపుతో రాస్తారు. స్వస్తిక్ గుర్తు శుభప్రదంగా భావిస్తారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని అంటారు. ఆనంద, శ్రేయస్సును కలిగించడంలో ఈ సింబల్ ఉపయోగపడుతుంది. గంధంతో ఇంటికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తును రాయడం వల్ల నరదృష్టి నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రధాన ద్వారా ఇరువైపులా ఇలా స్వస్తిక్ గుర్తును రాయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.