Dipendra Singh: చైనా నిర్వహిస్తున్న ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ టీం కొన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పడం జరిగింది.నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అంతర్జాతీయ టి 20 క్రికెట్ లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్ గా హిస్టరీ ని క్రియేట్ చేసాడు.ఇంతకు ముందు ఈ రికార్డు మన యువరాజ్ సింగ్ పేరు మీద ఉండేది. ఆయన 2007 టి 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ మీద ఆడిన ఒక మ్యాచ్ లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి వరల్డ్ రికార్డు ని క్రియేట్ చేసాడు.ఆ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ బౌలర్ అయినా స్టూవర్డ్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టి మరో అరుదైన రికార్డు ని కూడా నెలకొల్పాడు. ఇక రీసెంట్ గా ఏషియన్ గేమ్స్ లో నేపాల్ కి చెందిన ప్లేయర్ అంత పెద్ద రికార్డ్ ని బ్రేక్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇన్నిరోజుల నుంచి అన్ని పెద్ద దేశాలు అంత మంది టాప్ ప్లేయర్లు ఉన్న ఎవ్వరు కూడా ఈ రికార్డు ని బ్రేక్ చేయలేదు కానీ ఒక పసి కూన అయినా నేపాల్ కి చెందిన దీపేంద్ర సింగ్ అనే ప్లేయర్ ఆ రికార్డు ని బ్రేక్ చేయడం నిజం గా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఇక మ్యాటర్ లోకి వెళ్తే ఏషియన్ గేమ్స్ లో నేపాల్ కి మంగోలియా కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ టీం నిర్ణీత 20 ఓవర్లకి మూడు వికెట్లు కోల్పోయి ఏకం గా 314 పరుగులు చేసింది.టి 20 ఫార్మాట్లో ఒక ఇనింగ్స్ లో ఒక టీం చేసిన హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే కావడం విశేషం.ఇంతకు ముందు ఐర్లాండ్ మీద అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 278 పరుగులుకి చేసింది.మొన్నటి వరకు అదే రికార్డు గా ఉండేది. ఇక నేపాల్ మొన్నమంగోలియా మీద ఆడిన మ్యాచ్ లో ఈ రికార్డు ని బ్రేక్ చేసి టి 20 ఫార్మాట్లో 300 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక టీం గా వరల్డ్ క్రికెట్ లోనే ఒక అరుదైన రికార్డు ని సొంతం చేసుకుంది…
ఇక ఈ మ్యాచ్ లోదీపేంద్ర సింగ్ మొత్తం 10 బంతుల్లో 8 సిక్స్ లు కొట్టి 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక ఇతనికి తోడు గా కుషాల్ మల్లా కూడా 50 బంతుల్లో 13 సిక్స్ లు, 8 ఫోర్లు కొట్టి 137 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.వీళ్లిద్దరి విధ్వంసమైన ఇన్నింగ్స్ తో నేపాల్ భారీ రికార్డు లను నెలకొల్పింది.ఇక కుషాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా వరల్డ్ క్రికెట్ చరిత్ర లో నిలిచాడు.ఇక ఇంతకు ముందు రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్,సుదేష్ విక్రమసేకర ముగ్గురు 35 బంతుల్లో సెంచరీ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ లని నమోదు చేయగా, కుషాల్ మల్లా మాత్రం వీళ్ల ముగ్గురి రికార్డు ని బ్రేక్ చేస్తూ తను 34 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పాడు…
ఇక ఈ మ్యాచ్ లో ఛేజింగ్ కి వచ్చిన మంగోలియా టీంని 41 పరుగులకే ఆల్ అవుట్ చేసి నేపాల్ టీం టి 20 ఫార్మాట్లోనే అత్యధిక రన్స్ తో గెలిచినా టీం గా కూడా ఒక రికార్డు ని క్రియేట్ చేసింది… మంగోలియా మీద 273 పరుగుల తేడా తో విజయం సాధించి ఎవ్వరికి సాధ్యం కానీ ఒక గొప్ప రికార్డు ని కూడా తన పేరిట నమోదు చేసుకుంది…అలాగే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టీం గా కూడా నేపాల్ మరో రికార్డు ని కూడా తన ఖాతా లో వేసుకుంది.ఒకే ఇన్నింగ్స్ లో నేపాల్ 26 సిక్స్ లు కొట్టి ఏ పెద్ద జట్టుకు కూడా సాధ్యం కానీ రీతిలో మరో విజయాన్ని కూడా దక్కించుకుంది…
ఒకే మ్యాచ్ లో హైయెస్ట్ టీం స్కోర్,ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ సెంచరీ,అత్యధిక రన్స్ తో విజయం సాధించడం,ఒకే ఇన్నింగ్స్ లో అత్యధికమైన సిక్స్ లు కొట్టడం లాంటి ఐదు రికార్డులు ఒకే మ్యాచ్ లో సాధించి క్రికెట్ హిస్టరీ లోనే నేపాల్ ఒక అద్భుతాన్నిరికార్డు ని క్రియేట్ చేసిందనే చెప్పాలి…