Vastu Tips: మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇల్లు పక్కా వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. దీంతో వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలనేదానిపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచుకోవాలనే దాని మీద దృష్టి సారించాలి. ఎవరైనా సుఖంగా సంతోషంగా జీవించాలని అనుకుంటారు. దానికి కూడా వాస్తు సహకరించాలి. పక్కా వాస్తు లేకపోతే తిప్పలు తప్పవు. ఇంట్లో వంటగదిని కూడా ప్రత్యేకంగా చూసుకోవాలి. వంట గది వాస్తు ప్రకారం లేకపోతే కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వంట గదిలో పెట్టుకునే వస్తువులపై చొరవ తీసుకోవాలి.

చాలా మంది వంట గది విషయంలో ఏవేవో చెబుతుంటారు. వంటగదికి స్థలం తక్కువ కేటాయించినా సరిపోతుందని అంటారు. కానీ అది నిజం కాదు. వంట గది కూడా విశాలంగా ఉండాలి. మనం తినే ఆహార పదార్థాలు ఇక్కడే ఉండటంతో వంటగదిపై ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. వాస్తు ప్రకారం వంట గదిని ఎలా నిర్మించుకోవాలి? ఏ దిశలో ఏర్పాటు చేుకోవాలి? ఏ వస్తువులు ఉంచుకోవాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాస్తుకు అనుగుణంగా వంట గదిని నిర్మించుకుని నష్టాలు లేకుండా జాగ్రత్త పడాలి.
ఎక్కువ మంది వంట గదిని ఆగ్నేయంలో నిర్మించుకుంటారు. వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సంపద పెరగడమే కాకుండా ఆరోగ్యం మెరుగుపడుతుంది. వంటగదిలో తాగునీటిని నిలువ ఉంచుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కుళాయి ఈశాన్య దిశలో ఉండేలా జాగ్రత్త పడాలి. వాయువ్య మూలలో సింక్ ఉంటే శుభప్రదంగా భావిస్తారు. వంటగదిలో వస్తువులను వాస్తు ప్రకారం ఉంచుకుంటే మనకు ఎలాంటి ఆపదలు రావనే సంగతి గుర్తుంచుకోవాలి.

వంట గదిలో ఎలక్ర్టానిక్ పరికరాలను దక్షిణం వైపు ఉంచుకోవడం మంచిది. ఈశాన్య, నైరుతిలో వీటిని ఉంచడం మంచిది కాదు. ఆహార పదార్థాలు, పప్పులు, బియ్యం వంటి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచుకోవడం సురక్షితం. వంట గది గోడలకు నారింజ రంగు వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వంట గదిలో నలుపు, నీలం రంగులు వాడకూడదు. నలుపు రంగు ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ప్రధాన ద్వారానికి వంట గది ఎదురుగా ఉంటే వాస్తు దోషం కలుగుతుంది. అలాంటప్పుడు వంట గదికి పరదా వంటిది కట్టుకుంటే నష్టం ఉండదు వంట గది విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని తెలుసుకోవాలి.