Anchor Suma: బుల్లితెరపై యాంకర్ సుమది ఘనమైన చరిత్ర. సినిమాల్లో చిరంజీవి, క్రికెట్లో సచిన్ లా అన్నమాట. దశాబ్దాలుగా సుమ తిరుగులేని యాంకర్ గా ఉన్నారు. ఆమెకు పోటీ ఇచ్చే మరో యాంకర్ పుట్టలేదు. బహుశా పుట్టరు కూడా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఆమె సాధించిన విజయాలు. నెలకొల్పిన రికార్డులు. సుమ సక్సెస్ చూసి స్టార్ హీరోలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సంబంధం లేకపోయినా పెద్ద పెద్ద ఈవెంట్స్ లో సుమ యాంకరింగ్ గురించి బడా హీరోలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తన ఫేమ్ కి తగ్గట్లే సుమ కోట్లు కూడబెట్టారు. హైయెస్ట్ పెయిడ్ యాంకర్ గా ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. క్షణం తీరిక లేకుండా ఆడియన్స్ ని ఆమె ఎంటర్టైన్ చేశారు. అదే స్థాయిలో ఆర్థికంగా ఎదిగారు. సుమ ఆస్తులు లెక్కకడితే కళ్ళు బైర్లు కమ్ముతాయి. అదంతా కేవలం తన టాలెంట్ ద్వారా వచ్చిన సంపద మాత్రమే. కానీ మంచి మనసున్న సుమ తనను ప్రేక్షకులు ఆదరించడం ద్వారానే అని నమ్ముతారు. తాను అనుభవించే ఈ స్టేటస్, లగ్జరీ లైఫ్, నేమ్, ఫేమ్ ప్రేక్షకులు అందించిన బహుమతిగా భావిస్తారు.

మరి సమాజం మనకు అంత ఇచ్చినప్పుడు ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ విషయంలో సుమ ఒక అడుగు ముందే ఉన్నారు. తన దానధర్మాల గురించి ఏనాడూ బయటపెట్టని సుమ… తాజాగా సందర్భం రావడంతో ఓపెన్ అయ్యారు. సుమ ఓ చారిటీ సంస్థ పేరిట 30 మంది పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకున్నారట. వారి చదువు కంప్లీటై సెటిల్ అయ్యే వరకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తున్నారట. అలాగే మరికొన్ని సంస్థలతో చేతులు కలిపి సేవలు విస్తరిస్తున్నారట.
సుమ చేస్తున్న మంచి పనుల గురించి తెలిసిన అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ అని కొనియాడుతున్నారు. చాలా మంది సంపాదిస్తారు. అందులో కొంత సోషల్ సర్వీస్ కి ఖర్చు చేయాలని మీలా భావించేవారు కొందరే అని మెచ్చుకుంటున్నారు. కాగా సుమ ఇటీవల యాంకరింగ్ కి విరామం ప్రకటించారు. అది ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అనూహ్యంగా ఆమె సుమ అడ్డా పేరుతో కొత్త టాక్ షో ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి షోకి గెస్ట్ గా వచ్చారు