
Vastu Tips: ఈ రోజుల్లో వాస్తుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏది చేసినా పక్కా వాస్తు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో వాస్తు నియమాలు పాటించకపోతే దుష్ఫరిణామాలు ఏర్పడతాయి. ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. వాస్తు చిట్కాలు చిన్నవే అయినా పెద్ద నష్టాల్ని తీసుకొస్తాయి. అందుకే ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు పరంగా ఉండేలా చూసుకోవాలి. పొరపాటుగా చేసిన కొన్ని తప్పులే ముప్పుగా మారుతాయి. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు, అనారోగ్యాలు దరిచేరతాయి. కుటుంబ సభ్యుల్లో సఖ్యత లోపిస్తుంది. అందుకే దారిద్ర్యాన్ని దూరం చేసుకోవాలంటే వాస్తు పద్ధతులు పాటిస్తేనే మంచిది.
అన్ని వాస్తు ప్రకారం ఉంటేనే..
ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం ఉంటే సానుకూల శక్తి కలుగుతుంది. శ్రేయస్సు పెరుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. సమస్యలను దూరం చేస్తుంది. ఇంట్లోకి ప్రతికూల శక్తి రావడానికి కుటుంబ సభ్యులే కారణమవుతారు. కొన్ని దురలవాట్లను మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సంక్షోభాలను నివారించుకోవడానికి కూడా మన అలవాట్లను దూరం చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఐదు చెడు అలవాట్లను దూరం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే..
వాస్తు నియమాల్లో భాగంగా ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయకూడదు. విరిగిపోయిన వస్తువులు, పగిలిపోయిన సామను పడేయకూడదు. మరుగుదొడ్డిని క్లీన్ గా ఉంచుకోవాలి. కొందరు బద్ధకం వల్ల ఇలా చేస్తుంటారు. బద్ధకం అలవాటు ఉన్న వారు మార్చుకోవాలి. లేదంటే వారి ఇంటికి ముప్పు వాటిల్లుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే సానుకూల శక్తులు వస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు వర్తిస్తాయి.
మంచం మీద కూర్చుని తింటే..
కొందరికి మంచం మీద కూర్చుని తినే అలవాటు ఉంటుంది. ఇది కరెక్టు కాదు. మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇంట్లో శాంతి, ఆనందం లోపిస్తాయి. మంచం మీద కూర్చుని తింటే అప్పులు పెరుగుతాయి. పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయడం ఏ రకంగా చూసిన మంచిది కాదు. ఈ అలవాటును కచ్చితంగా మార్చుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. చెడు అలవాట్లను మార్చుకుని మంచి జరగాలని కోరుకోవాలి.
ఇంటి ప్రధాన ద్వారంతో జాగ్రత్త
ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్ల, చెప్పులను పెడుతుంటారు. ఇది ఏ మాత్రం సరైంది కాదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలు, చెప్పులు ఉంచకూడదు. ఒకవేళ వాటిని అలా పెడితే ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తులు రాకుండా ఉంటాయి. ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలు, చెప్పులు విడవకూడదు. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమె ఇంట్లోకి రాకుండా పోతుంది. దీంతో మనకు చెడు ప్రభావాలు కలుగుతాయి. ప్రధాన ద్వారం వద్ద ఏమి ఉండకుండా చూసుకోవాలి.

వంట గదితో..
భోజనం చేసిన తరువాత చాలా మంది పాత్రలు కడగకుండా అలాగే ఉంచుతారు. ఇది కూడా దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. తిన్న తరువాత పాత్రలు అలాగే ఉంచడం మంచిది కాదు. దీని వల్ల దుష్టఫలితాలు వస్తాయి. కిచెన్ అపరిశుభ్రంగా ఉంటే దారిద్ర్యం తాండవిస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా సంతృప్తికరమైన ఫలితాలు రాకుండా పోతాయి. పాత్రలను పగలైనా, రాత్రయినా ఎప్పటివి అప్పుడే కడుక్కోవడం ఉత్తమం. కిచెన్ ను ఎప్పుడు కూడా అపరిశుభ్రంగా ఉంచుకుంటే నష్టమే.