
India Vs Australia 2023: కంగారూల బలం ప్రస్తుతం తగ్గిపోయింది. టీమిండియా బలం పెరిగిది. దీంతో ఇండియాను ఎలాగైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో లేనిపోని మాటల యుద్ధానికి తెర తీస్తోంది. స్లెడ్జింగ్ కు దిగుతోంది. బలమైన ప్రత్యర్థిని కొట్టాలంటే మాటల్లోనే పెట్టి వారి నైతిక స్థైర్యం దెబ్బతీయాలనేది ఆసీస్ వ్యూమం. ఇలా పలుమార్లు పలు దేశాలపై ఇలాగే చేసి వ్యూహాలను అమలు చేసింది. ఇప్పుడు టీమిండియాతో గురువారం నుంచి నాగపూర్ వేదికగా జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరగనుంది. దీంతో ఆటగాళ్ల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆసీస్ కొత్త గేమ్ కు ఆజ్యం పోస్తోంది.
మూడేళ్ల నాటి వీడియోతో..
ఈ నేపథ్యంలో ఆసీస్ మూడేళ్ల క్రితం వీడియో ఒకటి షేర్ చేసి టీమిండియా ఆటగాళ్ల మానసిక బలంపై దెబ్బ కొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సిరీస్ లో ఓటమి ఖాయమనే భావనతో ఇండియా ఆటగాళ్లను దెబ్బ తీయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఫిబ్రవరి 9న జరిగే టెస్ట్ సిరీస్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో టీమిండియాపై ఆస్ట్రేలియా అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి వారిని కుంగదీయాలని చూస్తోంది. దీనికి గాను పటిష్టంగా ప్లాన్ కూడా వేసింది.
2020లో..
2020లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిది. ఆ సమయంలో దారుణంగా విఫలమైంది. స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. 36 పరుగులే చేసి భారత్ వైఫల్యం చెందింది. ఈ మ్యాచ్ లో ఆసిస్ బౌలర్లు హేజిల్ వుడ్ (5/8), పాట్ కమ్మిన్స్ (4/24) తో భారత్ కు భంగపాటు తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి భారత్ ఆటగాళ్ల పరిస్థితి ఇది అని చెబుతోంది. ఈ ఓటమి తరువాత టీమిండియా పుంజుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో చేజిక్కించుకుంది. కానీ భారత ఆటగాళ్లను తప్పుదోవ పట్టించేందుకు కంగారూలు ఇలాంటి కుట్రలు చేయడం కొత్తేమీ కాదు.

తరువాత పుంజుకుని..
తరువాత జరిగిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా గింగిరాలు కొట్టింది. భారత ఆటగాళ్ల దెబ్బకు కుదేలైంది. కానీ ఒక్క టెస్టులో నిరాశ పరిచినంత మాత్రాన టీమిండియాకు నష్టమేమీ లేదు. భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా దెబ్బకు ఆసీస్ విలవిలలాడింది. విజయం కోసం తపించినా దాని కల నెరవేరలేదు. అలాంటి సిరీస్ లో మొదటి మ్యాచ్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి భారత ఆటగాళ్లపై విమర్శలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆసీస్ ఆటగాళ్ల తీరు ఇక మారదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి. దమ్ముంటే సవాలు చేసి గెలవాలి. కానీ పాత వీడియోలు తీసుకొచ్చి నిందలు మోపడం సమంజసం కాదు.