Veedi Pootu: వాస్తు టిప్స్: వీధి పోటు అంటే ఏమిటో తెలుసా?

ఇంటి నిర్మాణం చేసేటప్పుడే వీధిపోటు గురించి ఆరా తీస్తాం. వీధిలో వెళ్లే వారి దృష్టి మన ఇంటి మీద పడితే దాన్నే వీధిపోటు అని అంటారు. వీధిపోటు ఎలా ఉంటుందంటే దారి మన ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే దాన్ని వీధిపోటుగా భావిస్తుంటారు. ఇది ఎటు వైపు ఉంటే మంచిది. ఎటు వైపు ఉంచుకోకుండా ఉండాలి.

Written By: Srinivas, Updated On : July 10, 2023 8:42 am

Veedi Pootu

Follow us on

Veedi Pootu: మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధానంగా చూసుకునేది వీధిపోటు సమస్య. ఈ సమస్య ఉంటే మనకు ఆర్థికంగా కలిసి రాదు. ఇంట్లో కష్టాలు రావడం కామన్ అవుతుంది. వీధిపోటు వల్ల అశుభాలు కలుగుతాయి. వీధి పోటు ఎటు వైపు ఉంటే మంచిది ఎటు ఉంటే మంచిది కాదో అవగాహన ఉండాలి. అప్పుడే మనకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఆ దిశగా మనం అడుగులు వేయడం వల్ల మనకు అనుకూల ఫలితాలు వస్తాయి.

వీధి పోటు ఎలా గుర్తిస్తారు?

ఇంటి నిర్మాణం చేసేటప్పుడే వీధిపోటు గురించి ఆరా తీస్తాం. వీధిలో వెళ్లే వారి దృష్టి మన ఇంటి మీద పడితే దాన్నే వీధిపోటు అని అంటారు. వీధిపోటు ఎలా ఉంటుందంటే దారి మన ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే దాన్ని వీధిపోటుగా భావిస్తుంటారు. ఇది ఎటు వైపు ఉంటే మంచిది. ఎటు వైపు ఉంచుకోకుండా ఉండాలి.

వీధి పోటు ఫలితం ఎలా ఉంటుంది

తూర్పు వైపు- తూర్పు ఈశాన్యం, ఉత్తరం – ఉత్తర ఈశాన్యం, పడమర – పడమర వాయువ్యం, దక్షిణం – దక్షిణ ఆగ్నేయం ఈ దిక్కుల్లో వీధి పోటు ఉంటే మంచిదే. ఇంటి ఎంట్రన్స్ కికాకుండా బాల్కనీకి, ఖాళీ జాగాకు వస్తే మంచిదే.

ఎలా గుర్తించడం

రోడ్డు ఇంటికి అభిముఖంగా వచ్చి తగలడాన్ని వీధిపోటు అంటారు. రోడ్డు పోటు ద్వారా వచ్చిన రహదారి వెడల్పుకన్నా మధ్యలో ఇంకో పెద్ద రోడ్డు ఉంటే దాన్ని వీధిపటు అంటారు. ఆ రోడ్డు నుంచి చాలా ఎక్కువ మంది వెళ్లడం వల్ల వారి చూపు మన ఇంటిపై పడితే అది మన లక్ష్మీస్థానానికి యజమాని దూరమవుతాడు. దీంతోనే దీన్ని వీధిపోటు అంటారు.