PM Kisan EKYC: ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ డబ్బులు

అయితే దీని కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో తమ వివరాలను అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పీఎం కిసాన్ కు సంబంధించిన వివరాలు అందజేయని వారు 6.47 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు తమ వివరాలను అప్లోడ్ చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Written By: Srinivas, Updated On : July 7, 2023 12:03 pm

PM Kisan EKYC

Follow us on

PM Kisan EKYC: రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.6000ను సాయం చేస్తోంది. విడతల వారీగా ప్రతీసారి రూ.2000లను నేరుగా రైతు అకౌంట్లోకి జమ చేస్తున్నారు.‘పిఎం కిసాన్ సమ్మాన్’ పేరిటీ ఈ సాయాన్ని దేశంలోని అన్ని రకాల రైతులకు అందిస్తున్నారు. 5 ఎకరాల లిమిట్ పెట్టి నిజమైన రైతులను ఎంపిక చేసి వారికి మాత్రమే అందిస్తున్నారు. అయితే రైతులు తమ వివరాలు కేంద్రం వద్ద సరిగా లేనందున చాలా మందికి ‘పీఎం కిసాన్’ సాయం అందడం లేదు. దీంతో చాలా మందికి ఈ డబ్బులు వస్తాయన్న విషయం కూడా తెలియదు.

అయితే దీని కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో తమ వివరాలను అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పీఎం కిసాన్ కు సంబంధించిన వివరాలు అందజేయని వారు 6.47 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు తమ వివరాలను అప్లోడ్ చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పీఎం కిసాన్ తో రైతులు తమ వివరాలను ‘మీ సేవ’ కార్యాయాలకు వెళ్లి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా తము తెలిసిన వారి సహాయంతో మొబైల్ లోనూ అప్లోడ్ చేయవచ్చు. https://pmkisan.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ఎడమ వైపు ఉన్న ఈకేవేసీపై క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. అయితే ఇక్కడ ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఆ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీనిని వెబ్ సైట్ లో సూచినంచిన ప్రదేశంలో నమోదు చేస్తే ఈ కేవేసీ పూర్తి అవుతుంది.

చాలా మంది ఈ చిన్న పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొంతమంది అవగాహన లేకపోవడంతో దీనిని పట్టించుకోవడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టడంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన ప్రతి రైతుకు ‘పీఎం కిసాన్’ డబ్బులు అందేలా చూడాలని తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. అయితే జూలై 31 లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అందుకోసం రైతులు అవగాహన కల్పించాలని అన్నారు. పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేస్తేనే డబ్బుల అందుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.