Goddess Lakshmi: ఈ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లే

మనం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి. ముందు వాకిట్లో ముగ్గు ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోట కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోట ముందు కూడా దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలుస్తుంది.

Written By: Srinivas, Updated On : July 7, 2023 12:14 pm

Goddess Lakshmi

Follow us on

Goddess Lakshmi: అన్నింటికి డబ్బే మూలం. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. చేతిలో డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. అందుకే అందరు డబ్బు సంపాదించాలని ఆశ పడుతుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకు డబ్బు వస్తుంది. పేదరికం లేకుండా ఉండాలంటే ధనమే మూలం. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఎన్నో పరిహారాలు చేస్తుంటాం. ఆమె దయ కోసం మనం పూజిస్తూ ఉంటాం. వేడుకుంటూ కొలుస్తాం.

లక్ష్మీదేవి కృప కోసం..

మనం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే కొలువుంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి. ముందు వాకిట్లో ముగ్గు ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఇల్లును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోట కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోట ముందు కూడా దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిలుస్తుంది.

గొడవలు ఉండకూడదు

ఇంట్లో నిత్యం ఏదో ఒక గొడవ ఉంటే లక్ష్మీదేవి ఉండదు. పిల్లలను కొట్టడం, తిట్టడం, ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న తగాదాలు ఉంటే కూడా ఆమె మన ఇంట్లోకి రాదు. ఇంటి గుమ్మం నుంచి చూస్తే ఇంటి పెరట్లో ఉన్న తులసి, అరటి చెట్లు కనబడాలి. అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది లేనిది కూడా తెలుసుకోవచ్చు.

సంకేతాలు

లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందనడానికి సంకేతాలు ఇవే. మధ్యాహ్నం సమయంలో కోకిల పాట వినిపించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. మన కుడి లేదా ఎడమ భుజం మీద బల్లి పడితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని అర్థం. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే కూడా లక్ష్మీ రాబోతున్నట్లే. రెండు తలల పాము ఇంట్లో కనిపిస్తే మన ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లే. ఇలా వీటిని బట్టి మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటున్నట్లు తెలుసుకోవచ్చు.