Sleeping Vastu Tips: మనం వాస్తు పద్ధతులు పాటిస్తుంటాం. ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటాం. దీంతో వాస్తు చిట్కాలు పాటించడం వల్ల మనకు ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంట్లో వాస్తు కచ్చితంగా ఉండాలని భావిస్తాం. దీని కోసమే చర్యలు తీసుకుంటాం. ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో సూచిస్తుంది. లేకపోతే ప్రతికూలతలు వస్తాయి. నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకుంటాం.
పడుకునే ముందు
రాత్రి పడుకునే ముందు మంచం దగ్గర ఏం ఉంచుకోకూడదు. మంచం పక్కన చాలా మంది నీళ్లు పెట్టుకుంటారు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. చాలా మంది నిద్రపోయే ముందు పేపర్ లేదా పుస్తకం చదివే అలవాటు ఉంటుంది. వాటిని చదువుతూ నిద్రలోకి జారుకుంటారు. వాటిని దిండు కింద పెడుతుంటారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం మంచి అలవాటు కాదు.
భోజనం
పడక గదిలో భోజనం చేయకూడదు. కొందరు మంచంపై కూర్చుని తింటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. తిన్న తరువాత ఎంగిలి పల్లెం మంచం పక్కన పెట్టుకోకూడదు. ఇలా చేస్తే పీడ కలలు వస్తాయి. దాంపత్య జీవితంలో కలతలు రావడం ఖాయం. బెడ్ రూంలో భోజనం చేయకూడదు. భోజనం చేసిన తరువాత పాత్రలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.
దిండు కింద నగలు
చాలా మంది ఆడవాళ్లు పడుకునే ముందు నగలు తీసి దిండు కింద పెట్టుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. నగలు దిండు కింద పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నగలుసరైన స్థానంలో భద్రపరచిన తరువాత మాత్రమే నిద్ర పోవడం మంచిది. నగలు దిండు కింద పెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఒకసారి వేసుకున్న బట్టలు
ఒకసారి వేసుకున్న బట్టలు మరోసారి వేసుకోకూడదు. వాడిన బట్టలు ఉతికిన తరువాతే కట్టుకోవాలి. కొందరు అలా చేయరు. రెండు మూడు రోజులు వేసుకుంటారు. ఇది సరైంది కాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. బట్టలు ఎప్పుటికప్పుడు ఉతుక్కునే వేసకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.