Hanuman Photo: మనం పక్కా వాస్తు చూసుకుంటాం. లేకపోతే సమస్యలు చుట్టుముడతాయి. వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే అనర్థాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఇంట్లో పూజాగది కూడా వాస్తు ప్రకారం ఉండాల్సిందే. అందులో ఉండే దేవుళ్ల ఫొటోలు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెట్టుకుంటే మనకు ముప్పు రావడం ఖాయం. వాటిని కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఇంట్లో హనుమంతుడి ఫొటో ఉంటుంది. ఆ ఫొటోను ఎలా పెట్టుకోవాలి? ఎలా పెట్టుకుంటే శుభ ఫలితాలొస్తాయనే విషయాలపై దృష్టి సారించడం మంచిది.
దక్షిణాభిముఖంగా..
వాస్తు ప్రకారం హనుమంతుడి ఫొటోను పూజ గదిలో దక్షిణ దిశలో ఉంచాలి. కూర్చున్న భంగిమలో ఎరుపు రంగులో ఉండే ఫొటోను వాడాలి. దక్షిణాభిముఖంగా ఉండే ఆంజనేయుడు మనకు మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాడని నమ్ముతుంటారు. ఈ దిశలో హనుమంతుడి ఫొటో పెట్టడం వల్ల దుష్టశక్తులు కూడా నశిస్తాయి. ఆనందం, ఐశ్వర్యం పెరగడానికి కూడా ఇలా చేస్తేనే మంచిది.
ఉత్తరం వైపు..
ఇంట్లో హనుమంతుడి ఫొటో ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఆంజనేయుడి ఫొటోలు ఒక్కో దిక్కు పెడితే ఒకో రకమైన లాభాలను ప్రసాదిస్తుంటాడు. అందుకే అభయాంజనేయుడు అయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే బలవంతుడు. దీంతోనే ఆయనన అందరు పూజిస్తుంటారు. తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు.
పంచముఖ హనుమాన్
వాస్తు ప్రకారం ఇంట్లో పంచముఖ హనుమాన్ ఫొటో ఉంచుకుంటే ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలోని వారికి ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది. ఇంట్లోని ప్రధాన ద్వారంపై పంచముఖ హనుమాన్ ఫొటో ఉంటే అన్ని మంచి శకునాలే లభిస్తాయి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా ఆంజనేయుడి వల్ల మనకు అభయం కలుగుతుంది.
పర్వతం ఎత్తుకొస్తున్న..
ఇంట్లో పర్వతం ఎత్తుకొస్తున్న హనుమాన్ ఫొటో ఉంటే ధైర్యం, బలం, విశ్వాసం మెండుగా లభిస్తాయి. ఎన్ని బాధలు ఎదురైనా ఆంజనేయుడి వలే ఎదురు నిలుస్తామని మనసులో విశ్వాసం కలుగుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా చిటికెలో తీరుస్తామనే ధైర్యం కలుగుతుంది. ఆంజనేయుడిని పూజిస్తే మనకు అనంత శక్తులు రావడం ఖాయం. అందుకే ఇలాంటి ఫొటోలు ఉంచుకుని మన సమస్యలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.