https://oktelugu.com/

Vastu Shastra Tips: చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?

Vastu Shastra Tips: పెద్దలు చెప్పిన పనులు పాటించడం అనేది సంప్రదాయంగా వస్తున్నది. దాంతో పాటు కొన్ని నమ్మకాలు కూడా జనాలు ఫాలో అవుతుంటారు. అందులో నైట్ టైమ్స్ లో ఈ వస్తువులు, పదార్థాలు ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు అని పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు. అలా చీకటి పడ్డాక ఏయే వస్తువులు లేదా పదార్థాలు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలు చెప్తున్న ప్రకారం.. రాత్రి వేళల్లో పాలు కాని పెరుగు కాని ఇవ్వొద్దు. కానీ, ఇప్పుడు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 26, 2022 / 10:26 AM IST
    Follow us on

    Vastu Shastra Tips: పెద్దలు చెప్పిన పనులు పాటించడం అనేది సంప్రదాయంగా వస్తున్నది. దాంతో పాటు కొన్ని నమ్మకాలు కూడా జనాలు ఫాలో అవుతుంటారు.

    అందులో నైట్ టైమ్స్ లో ఈ వస్తువులు, పదార్థాలు ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు అని పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు. అలా చీకటి పడ్డాక ఏయే వస్తువులు లేదా పదార్థాలు ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

    curd

    పెద్దలు చెప్తున్న ప్రకారం.. రాత్రి వేళల్లో పాలు కాని పెరుగు కాని ఇవ్వొద్దు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. దాదాపుగా అందరూ సాయంత్రం వేళల్లోనే కాదు ఎప్పుడు వీలయితే అప్పడు కిరాణా షాపుల నుంచి పెరుగు లేదా ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు. అయితే, ఇళ్లలో మాత్రం పాలు, పెరుగు సాయంత్రం 4 గంటల తర్వాత అస్సలు ఇవ్వొద్దట. ముఖ్యంగా పెరుగు ఇవ్వడం వలన ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెప్తున్నారు.

    Also Read: Earn Money From Home: ఇంట్లో కూర్చుని నెలకు రూ.60 వేలు సంపాదించవచ్చు.. ఎలా అంటే?

    సాయంత్రం 4 గంటల తర్వాత అడిగిన వారికి పెరుగు ఇచ్చినట్లయితే ఇచ్చిన వారికి తోడు లేకుండా పోతుందని పెద్దలు వివరిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో తోడు అవసరమన్న సంగతి గుర్తించి.. కంపల్సరీగా తోడు ఉండాలని భావించాలి. కాబట్టి సాయంత్రం నాలుగు గంటల తర్వాత పెరుగు అస్సలు తోడుకు ఇవ్వకూడదట. అయితే, ఇటువంటి విషయాలలో మొహమట పడకుండా ఎవరైనా పెరుగు తోడు ఇవ్వాలని సాయంత్రం 4 గంటల తర్వాత అడిగినట్లయితే కుదరదని ముఖం మీదనే చెప్పేయాలని పెద్దలు సూచిస్తున్నారు.

    Salt

    అలా ఈవినింగ్ నాలుగు గంటల తర్వాత నుంచి మొదలుకుని మళ్లీ మరునాడు పొద్దున వరకు అనగా రాత్రి వేళల్లో ఈ వస్తువులను అస్సలు ఇవ్వొద్దట. అవేంటంటే..ఉప్పు, నువ్వులు, మిరపకాయలు, నూనె, నెయ్యి. సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత ఈ పనులు చేయడం ద్వారా శ్రీలక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. ఇలా వస్తువులు లేదా పదార్థాలను వేరే వారికి ఇచ్చినట్లయితే వీళ్ల భాగ్యం వాళ్లకు పోతుందని నమ్మాలని పెద్దలు చెప్తున్నారు. అయితే, ఈ విషయాలను కొంత మంది గృహిణులు ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం ఆధునిక పోకడల వలన వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పెద్దలు చెప్పిన ఈ విషయాలు పాటించడం ద్వారా మంచే జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: Dream Astrology: చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా.. అయితే దాని సంకేతం ఇదే!

    Tags