https://oktelugu.com/

Namrata Shirodkar Emotional: దాని కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు.. ఎమోషనలైన మహేష్‌ బాబు వైఫ్ !

Namrata Shirodkar Emotional: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత ఎమోషనల్ అయ్యారు. ఈ నెల 22న ఆమె 50వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన మహేష్, పిల్లలు సితార, గౌతమ్‌లతో ఆమె బాగా ఎంజాయ్ చేశారు. పైగా ఈ విషయాన్ని అభిమానులతో ప్రత్యేకంగా పంచుకున్నారు కూడా. ఇక ఈ సంబరాల నుంచి ఓ పిక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత.. ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 26, 2022 / 10:39 AM IST
    Follow us on

    Namrata Shirodkar Emotional: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత ఎమోషనల్ అయ్యారు. ఈ నెల 22న ఆమె 50వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన మహేష్, పిల్లలు సితార, గౌతమ్‌లతో ఆమె బాగా ఎంజాయ్ చేశారు. పైగా ఈ విషయాన్ని అభిమానులతో ప్రత్యేకంగా పంచుకున్నారు కూడా.

    HBD Namrata Shirodkar

    ఇక ఈ సంబరాల నుంచి ఓ పిక్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత.. ‘ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు’ అని పిల్లలపై తనకున్న ప్రేమను బయటపెట్టారు. దీంతో నమ్రత ఉత్తమ ఇల్లాలు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తమ్మీద ఎమోషనల్ అయిన మహేష్‌ బాబు వైఫ్ అంటూ నెటిజన్లు కూడా ఆమె పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.

    Also Read:  షాకింగ్ : మెగాస్టార్ కి కరోనా పాజిటివ్ !

    ఏది ఏమైనా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట మొదటి ప్లేస్ లో ఉంటుంది. పైగా ఈ టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మహేష్ బాబు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే.

    Namrata Shirodkar

    ఇంతకీ మహేష్ ఆమెకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడు అంటే. “పుట్టినరోజు శుభాకాంక్షలు నమ్రత. నువ్వు నా రాక్.. నాతో నా ప్రపంచాన్ని పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు” అని నమ్రత ఫొటోను ట్విట్‌లో పోస్ట్ చేశారు మహేష్ బాబు. ఈ ట్వీట్ కి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ తో పాటు పలువురు స్పందిస్తూ కామెంట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే.

    Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?

    Tags