
Mobile Phone: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగుతోంది. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో సాంకేతికత పెరగడంతో ఫోన్లు కూడా రెట్టింపయ్యాయి. అందరు ఫోన్లు వాడకంతోనే కాలం గడుపుతున్నారు. పిల్లలయితే ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్లోనే గేమ్ లు, వీడియోలు చూస్తున్నారు. దీనివల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. కొందరైతే మొబైల్ లోనే మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇంకా కొందరు బండి మీద వెళ్లేటప్పుడు కూడా ఫోన్ చూస్తూ వెళ్తున్నారు. అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు.
కంటిచూపుకే..
తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ రాత్రి సమయాల్లో ఎక్కువగా ఫోన్ చూడటంతో ఆమె కంటిచూపు దెబ్బతిన్నది. దీనికి గల కారణాలు వైద్యులు తెలుసుకుని అవాక్కయ్యారు. మొబైల్ వాడకం ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో కళ్లపై ప్రభావం చూపుతోంది. మొబైల్ వాడకాన్ని తగ్గించాలని ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ముప్పయి ఏళ్ల మహిళ తరచుగా ఫోన్ చూస్తూ కంటి చూపు కోల్పోయిందని ఓ వైద్యుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదకరమో తెలిసినా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు.
రాత్రి సమయాల్లో..
రాత్రి సమయంలో చాటింగ్ చేస్తూ ఉండేది. ఏడాది కాలంగా ఇదే విధంగా చేయడంతో ఆమె కళ్లపై ప్రభావం పడింది. సెల్ కు ఉన్న బ్లూ లైట్ కారణంగా మన కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతోనే ఆమె కళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఫోన్ వాడకం తగ్గించిన తరువాత కాస్త కుదుట పడింది. మొబైల్ వాడకం మంచిది కాదని ఎందరు చెబుతున్నా లెక్క చేయడం లేదు. అందుకే ఫలితాలు అనుభవిస్తున్నారు. ఇక విద్యార్థులైతే సమయం చూసుకోవడం లేదు. పొద్దంతా మొబైల్ తోనే గడుపుతున్నారు. ాత్రి వేళ కూడా దాంతోనే ఉంటున్నారు.
చర్మ సంబంధమైన సమస్యలు
మొబైల్ వాడకం వల్ల ఇతర చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. హెచ్చరికలను ఎవరు ఖాతరు చేయడం లేదు. ఫలితంగా ఎన్నో సమస్యలకు కేంద్రంగా నిలుస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో అనేక చిక్కులు వస్తున్నా ఎవరిలో మార్పులు కనిపించడం లేదు. మొబైల్ వాడకం మంచిది కాదని తెలిసినా మారడం లేదు. ఈ క్రమంలో వైద్యులు సైతం చెబుతున్నారు ఫోన్ల వాడకం తగ్గించుకోవాలని. అవసరమైతే తప్ప మొబైల్ ను దగ్గర ఉంచుకోవద్దని సూచిస్తున్నారు. ఎక్కువ సమయం మొబైల్ వాడితే బ్రెయిన్ పై కూడా ప్రభావం పడుతుంది.

నిద్ర పోయే సమయంలో..
రాత్రి సమయాల్లో ఫోన్లు వాడకం అసలు చేయకూడదు. నిద్ర పోయేటప్పుడు ఫోన్ దగ్గర ఉంచుకోకూడదు. అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. కనీసం మూడు అడుగుల దూరంలో ఫోన్ ఉంచుకోవాలి. లేదంటే మనకు జబ్బులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. దీంతో మొబైల్ వాడకం సరైంది కాదనే విషయం గ్రహించుకుని రోజులో కొంత సమయమైనా ఫోన్ వాడకుండా ఉండటమే శ్రేయస్కరం.