
Shubman Gill: క్రికెట్ లో ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకే చోటు దక్కుతుంది.. వారినే మేనేజ్మెంట్ అందలం ఎక్కిస్తుంది. ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వే దాకా క్రికెట్ సమాఖ్యలు ఇదే రూల్ ఫాలో అవుతాయి.. కానీ భారత క్రికెట్ సమాఖ్య ఇందుకు పూర్తి విరుద్ధం..ఫామ్ లో లేని ఆటగాళ్లను నెత్తిన పెట్టుకుంటుంది. భీకరమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తుంది.. ఈ మాటలను నిన్నటి నుంచి నెటిజన్లు అంటూనే ఉన్నారు.. భారత క్రికెట్ సమాఖ్యను దెప్పి పొడుస్తూనే ఉన్నారు. రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి భారత క్రికెట్ సమాఖ్యను ఒక ఆట ఆడుకుంటున్నారు.
గిల్ ప్రస్తుతానికి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ, టి20 లో సెంచరీ సాధించి భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అలాంటి ఆటగాడిని భారత క్రికెట్ సమాఖ్య రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది. ఇందుకు అది చెబుతున్న కారణం ఆస్ట్రేలియా తో అడే సిరీస్ లో అనుభవం ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చామని అంటున్నది. బిసిసిఐ చెప్పిన దాని ప్రకారమే గిల్ కంటే తోపు తురుంఖాన్ లాంటి ఆటగాడిని ఈ ఎంపిక చేస్తే ఎవరికీ పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ 200 కొట్టిన వాడిని పక్కనపెట్టి అసలు ఫామ్ లో లేని ఆటగాడిని ఎంపిక చేసింది.. అతడే కేఎల్ రాహుల్.. కానీ మొదటి టెస్టులో అతడు చేసిన పరుగులు 20. అది కూడా ముక్కీ మూలిగి.. ఇది చూసిన తర్వాత నిజంగా జట్టుకు కేఎల్ రాహుల్ అవసరం ఉందా? అని నె టిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
నాగపూర్ వేదికగా మొదలైన గవాస్కర్ బోర్డర్ ట్రోఫీలో తొలిరోజు ఆటలో టీం ఇండియా పై చేయి సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 177 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. అశ్విన్ 3 వికెట్లు, సిరాజ్, షమీ చెరో వికెట్ తీశారు.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబు షేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్మిత్ 37, క్యారీ 36 పరుగులతో పర్వాలేదు అనిపించారు. ఆరంభంలోనే ఆస్ట్రేలియా రెండు పరుగులకే రెండు వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి లబుషేన్, స్మిత్ నిదానంగా ఆడి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.. కానీ రవీంద్ర స్మిత్, లబు షేన్ జోడిని విడదీశాడు.. యువ వికెట్ కీపర్ కే ఎస్ భారత్ అద్భుతమైన స్టంపింగ్ చేయడంతో అవుట్ అయ్యాడు. ఆ మరసటి బంతికే వికెట్ తీసిన జడేజా ఆస్ట్రేలియా జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు.. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. జడేజాకు అశ్విన్ జత కలవడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరో పాతిక ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది.

దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. రాహుల్ తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ ప్రారంభించారు.. తొలి రెండు బంతులను ఫోర్లుగా తరలించి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించాడు. కానీ మరో ఎండ్ లో ఉన్న రాహుల్ మాత్రం పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు.. 30 బంతులకు పైగా ఆడి రాహుల్ ఒక ఫోర్ కూడా కొట్టలేదు. ఇలా రాహుల్ జుట్టు బ్యాటింగ్ ఆడుతుండటంతో మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ పై పరుగులు చేయాల్సిన వొత్తిరి పెరిగింది.. రోహిత్ శర్మ వేగంగా ఆడి ఆస్ట్రేలియా బౌలర్ల పై ఒత్తిడి పెంచాడు. రాహుల్ మాత్రం అందుకు భిన్నంగా ఆడాడు. ఇలా 71 బంతులు ఆడిన రాహుల్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. కొత్త కుర్రాడు మర్ఫీకి వికెట్ సమర్పించుకున్నాడు. చాలాకాలంగా ఫామ్ లో లేని రాహుల్ను జట్టులోకి తీసుకోవడం పైన క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే… భీకరమైన ఫామ్ లో ఉండి న్యూజిలాండ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన గిల్ ను పక్కనపెట్టి రాహుల్ ను ఓపెనర్ గా ఆడించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. 200 కొట్టిన గిల్ అవసరం లేదు కానీ… 20 కొట్టే రాహుల్ జట్టుకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది.
Gill after watching KL Rahul’s terrorism on crease 😭😭 pic.twitter.com/9PdvAL59SU
— R. (@ArrestRohit) February 9, 2023