https://oktelugu.com/

Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారంటే..?

ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక పాన్ ఇండియాలో కూడా తను నెంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 20, 2024 / 08:41 AM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమదైన రీతిలో సినిమాలను చేస్తూ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారనే విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగడంలో హీరోల రెమ్యూనరేషన్స్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి అంటూ కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మొత్తానికైతే ఇప్పుడు అత్యంత ప్రెస్టేజియస్ గా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.ఇక వీళ్ళ రెమ్యూనరేషన్ల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక పాన్ ఇండియాలో కూడా తను నెంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడు. కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక కల్కి సినిమా కోసం దాదాపు ఇంకా 130 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపిక పదుకొనే కూడా దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక అమితాబచ్చన్ కి 12 కోట్లు ఇచ్చారట.

    ఇంకా కమలహాసన్ విషయానికి వస్తే ఈయనకి ఈ సినిమాలో నటించినందుకు గాను 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే ముట్టజెప్పినట్టుగా తెలుస్తుంది.
    ఇక మొత్తానికైతే ఈ నలుగురికి కలిపి దాదాపు 170 కోట్ల వరకు రెమ్యూన రేషన్ రూపం లోనే వెళ్లిపోయాయి. ఇక మిగిలిన ఆర్టిస్టులందరికీ కలిపి మరొక 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయినట్లుగా తెలుస్తుంది.

    ఇక 600 కోట్ల సినిమా బడ్జెట్ లో నుండే డైరెక్టర్ కి కూడా రెమ్యూన రేషన్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అయిన అశ్వినీ దత్ అల్లుడే నాగ్ అశ్విన్ కాబట్టి వాళ్ల హోమ్ బ్యానర్ లోనే తను సినిమా చేస్తున్నాడు కాబట్టి అతనికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఎందుకంటే వచ్చిన లాభాలు మొత్తం వాళ్ళకే కాబట్టి ప్రత్యేకంగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు…