Grow Strong Hair : అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. అందులో జుట్టు ఇంకా రాలిపోవడం ఒకటి. జుట్టు ఆరోగ్యంగా ఉంటూ బలంగా పెరగాలంటే కేవలం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సరిపోదు. వీటిని వాడటం వల్ల జుట్టు పెరగడం ఏమో కానీ ఇంకా రాలిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి మరి జుట్టు రాలే సమస్యను ఇంకా పెంచుకుంటున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలంటే వాడే ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో మరి ఈ స్టోరీలో చూద్దాం.
జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వెదురు సారం బాగా ఉపయోగపడుతుంది. వెదురు సారం వాడటం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. ఈ వెదురులో ఉండే విటమిన్లు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తు్ంది. ఇందులో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వెదురులోని కాండం, ఆకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టును కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. కొందరు ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వెదురు సారాన్ని వాడవచ్చు. దీన్ని వాడటం వల్ల జుట్టు కూడా పగుళ్లు పడకుండా ఉంటుంది. కొత్తగా జుట్టు మళ్లీ పెరిగేలా చేస్తుంది. వెదురులో సారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును దెబ్బతినకుండా కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను కూడా దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
వెదురు సారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెదురు సారంతో జుట్టుని కడిగితే పగుళ్లు లేకుండా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేస్తు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే దీన్ని ఆయిల్‌గా కూడా తయరు చేసుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత వెదురు సారాన్ని కొబ్బరి నూనె లేదా అవకాడో నూనె లేదా మీరు ఉపయోగించే నూనెలో కలిపి జుట్టుకు కుదుళ్ల నుంచి పట్టించాలి. ఆ తర్వాత మళ్లీ తలస్నానం చేయాలి. రెండుసార్లు వారానికి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వెదురు సారం జుట్టుకు కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ వెదురు సారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ వెదురు సారం ఉపయోగించకపోవడం మేలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.