https://oktelugu.com/

UPI Payments: విదేశాల నుంచి ఈజీగా యూపీఐ ద్వారా డబ్బులు పంపొచ్చు.. లిమిట్ ఎంతంటే?

భారత దేశంలో యూపీఐ వినియోగం గణనీయంగా పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద బంగారం కొట్టు వరకు చాలా వరకు చెల్లింపులు యూపీఐల ద్వారానే జరుగుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 6, 2024 / 07:00 AM IST
    Follow us on

    UPI Payments: యూపీఐల ద్వారా చెల్లింపులు ఒకప్పుడు అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో మాత్రమే ఉండేవి. కానీ పెద్ద నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో యూపీఐల వినియోగం ఏటేటా పెరుగుతోంది. ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్న అందరూ చెల్లింపులను ఎక్కువగా యూపీఐల ద్వారాచే జరుపుతున్నారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ని అభివృద్ధి చేసింది. మొబైల్‌ పరికరాల ద్వారా పర్సనల్‌ ఖాతాలు, బ్యాంకులు మరియు వ్యాపారి ఖాతాల మధ్య నిజ–సమయ బదిలీలను యూపీఐ అనుమతిస్తుంది. ఇది ఆన్‌లైన్‌ చెల్లింపులను సౌకర్యవంతంగా, సులభతరం చేస్తూ తక్షణం బ్యాంక్‌–టు–బ్యాంక్‌ చెల్లింపులను కూడా సులభతరం చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రాధాన్య చెల్లింపు వ్యవస్థ.

    బదిలీ పరిమితి
    ఎన్‌పీసీఐ ప్రకారం రోజుకు యూపీఐ లావాదేవీ పరిమితి రూ.1 లక్ష. అయితే, క్యాపిటల్‌ మార్కెట్‌లు, బీమా, వసూళ్లు మరియు విదేశీ ఇన్‌వర్డ్‌ రెమిటెన్స్‌లకు సంబంధించిన లావాదేవీలకు పరిమితి రూ.2 లక్షలు. పన్ను చెల్లింపులు విద్యా సంస్థలు మరియు ఆసుపత్రులకు చెల్లింపులు, ఐపీవోఎం చెల్లింపులు, ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పథకాల చెల్లింపు గరిష్టంగా రోజువారీ బదిలీ పరిమితి రూ.25 వేల నుంచి రూ.1 లక్ష మధ్య బ్యాంకు నుండి బ్యాంకుకు మారవచ్చు . కొన్ని బ్యాంకులు కూడా రోజుకు బదులుగా వారానికి లేదా నెలకు యూపీఐ బదిలీ పరిమితులను సెట్‌ చేశాయి.

    విదేశీ చెల్లింపు పరిమితి..
    ఇక విదేశీల నుంచి భారతీయులకు యూపీఐ ద్వారా చెల్లింపుల కూడా ఇప్పుడు పెరియాయి. మొదట తక్కువగా అనుమతి ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాలు ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు యూపీఐ ద్వారా రోజుకు రూ.లక్ష బదిలీ చేసే అవకాశాన్ని ఎన్‌పీసీఐ కల్పించింది. దీనికోసం వినియోగదారులు బ్యాంకు అకౌంట్‌కు లింకై ఉన్న ఇంటర్నేషనల్‌ ఫోన్‌ నంబర్‌తో ఏదైనా యూపీఐని ఎనబుల్డ్‌ యాప్‌లో లాగిన్‌ చేసుకోవాలి. అమెరికా, కెనడా, యూకే, యూఏఈ సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న వారికి ఇది అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, డీబీఎస్‌ వంటి బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఈ సేవలను వాడుకోవచ్చు.

    లావాదేవీలకు ఫీజు..
    యూపీఐ లావాదేవీలలో , కస్టమర్‌ లావాదేవీని ప్రాసెస్‌ చేసినప్పుడు వ్యాపారి తప్పనిసరిగా చెల్లించాల్సిన లావాదేవీ రుసుములను ఇంటర్‌చేంజ్‌ ఫీజులు అంటారు. ఆ విధంగా, ఒక కస్టమర్‌ స్టోర్‌లో ఫోన్‌పే య్యూర్‌ కోడ్‌ని ఉపయోగించి యూపీఐ ద్వారా చెల్లింపు చేసినప్పుడు, వ్యాపారి ఇంటర్‌చేంజ్‌ రుసుమును పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కి చెల్లించాలి. వివిధ సేవలకు ఇంటర్‌చేంజ్‌ రుసుము 0.5–1.1% పరిధిలో వర్తిస్తుంది. ఇంధన చెల్లింపులపై 0.5%, పోస్టాఫీసు, టెలికాం, యుటిలిటీస్, వ్యవసాయం మరియు విద్యకు 0.7%, సూపర్‌ మార్కెట్‌ చెల్లింపులకు 0.9% మరియు బీమా, మ్యూచువల్‌ ఫండ్, ప్రభుత్వం మరియు రైల్వేలకు 1% ఇంటర్‌చేంజ్‌ ఫీజు వర్తిస్తుంది.