Child Aadhaar Update: ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం అంటే మామూలు విషయం కాదు. వారికి కావాల్సిన వస్తువులను కొనివ్వడమే కాకుండా భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల సౌకర్యాలను చేకూర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ముఖ్యంగా వారి చదువుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటి నుంచే వారి కి సంబంధించిన డాక్యుమెంట్లను అన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగా నేటి కాలంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. పుట్టిన పిల్లలనుంచి చనిపోయిన వ్యక్తి వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అయితే పిల్లల చదువుల విషయంలో కూడా ఆధార్ కార్డు లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వారి ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో 2026 సెప్టెంబర్ లోపు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. అదేంటంటే?
నేటి కాలంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ కార్డు తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అయితే ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్ పేరిట కార్డును ఇస్తారు. ఈ కార్డు ఇచ్చే సమయంలో ఎలాంటి బయోమెట్రిక్ తీసుకోరు. కేవలం ఐ కాంటాక్ట్ లేదా వారి తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ ద్వారా వీరికి ఆధార్ ఇస్తారు. ఐదు సంవత్సరాల తర్వాత పిల్లల బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది బాల ఆధార్ తీసుకొని ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. బాల ఆధార్ కార్డును అప్డేట్ చేసి సాధారణ ఆధార్ కార్డుగా మార్చుకోకపోతే విద్యాసంస్థల్లో, ఆస్పత్రుల్లో, ఇతర ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి బిడ్డకు తప్పనిసరిగా ఐదు సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే కొంతమంది ఆధార్ కార్డును అప్డేట్ చేయడం పెద్ద ప్రయాస అని అనుకుంటారు. క్యూలో గంటల తరబడి నిలబడి డబ్బులు ఖర్చు అవుతాయని అనుకుంటారు. కానీ 2026 సెప్టెంబర్ 30 లోపు పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇంటర్నెట్ ఉన్న ప్రతి చోట ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చును. అయితే అక్కడ బయోమెట్రిక్ సదుపాయం ఉండాలి. అందువల్ల సమీపంలోని మీసేవ లేక బయోమెట్రిక్ అవకాశమున్న చోట ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.