Special Dosa Recipe: ఎక్కడ పుట్టిందో.. ఎవరు ఆవిష్కరించారో తెలియదు కానీ.. ఇడ్లీకి సరిపోయే రేంజ్ లో కీర్తిని అందుకుంది దోశ. ఒకప్పుడు ఇది సౌత్ ఇండియాలోనే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ గా ఉండేది. ఇప్పుడు నార్త్ ఇండియాకు కూడా పాకింది. ఆనియన్, మసాలా ఫ్లేవర్లలో లభ్యమయ్యే దోశ.. ఆ తర్వాత అనేక మార్పులకు గురైంది. చివరికి కీమా దోశ, చికెన్ దోశ స్థాయికి ఎదిగింది. వచ్చే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులకు గురవుతుందో తెలియదు.
Also Read: భారతదేశంలో 5 అందమైన రైలు ప్రయాణాలు ఇవీ..
దోశ అనేది చాలామందికి ఒక సెంటిమెంటల్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ గా మారిపోవడంతో.. ఇందులోకి స్టార్టప్ కంపెనీలు కూడా వచ్చాయి. ముంబై ప్రాంతానికి చెందిన ఓ ఐటీ కపుల్ తమ ఉద్యోగాలను వదిలేసి దోశ తయారిలోకి వచ్చారు. ఏకంగా ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశారు. అంతేకాదు కేవలం దోశల తయారీ ద్వారానే నెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇక చైన్ లింకేజీ హోటల్స్ గురించి.. అవి తయారు చేస్తున్న దోశల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ అంచనా ప్రకారం ఇడ్లీ తర్వాత దోశలనే అధికంగా తింటున్నారట. దోశ మార్కెట్ విలువ దాదాపు ఏడాదికి 10000 కోట్ల వరకు ఉంటుందట..
దోశ ఎన్ని రకాలుగా మార్పులకు గురైనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దోశ మాత్రం వెరైటీగా ఉంటుంది. ఇక్కడ దొరికే దోశ పేరు పులిహోర దోశ. వేడివేడిగా కాలుతున్న పెనం మీద.. బియ్యం, మినుములు, జీలకర్ర మిశ్రమాన్ని రుబ్బుతారు. పచ్చి పిండిలో సన్నగా తరిగిన ఆనియన్ పీసులు, కొరియాండ్రం, వెట్ మిర్చి పీస్ లు వేస్తారు. పెనం మీద కొంత నెయ్యి వేసి.. దోస పోసి.. దానిపై కొంచెం కారం.. ఇంకాస్త ఆనియన్ పీస్ లు, రకరకాల మిశ్రమాలు వేస్తారు. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తారు. దానిపైన టైగర్ ఫుడ్ ను వేస్తారు.. దోశను ఎర్రగా కాల్చి అంతే వేడిగా సర్వ్ చేస్తారు. గ్రౌండ్ నట్, కోకోనట్, దెబ్బ కాయ పచ్చళ్ళు వేస్తారు.. తాగడానికి సాంబార్ కూడా పోస్తారు..
Also Read: ఉపవాసం ఎందుకు ఉండాలి? అనేది పులి, చిరుత పులి చెబుతుంది.. ఎలాగో తెలుసుకోండి..
వాస్తవానికి మిగతా ప్రాంతాలలో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు గానీ.. గుంటూరు వాళ్ళు మాత్రం పులిహోర దోశను కనిపెట్టి.. తమకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.. గుంటూరు నగరంలో దాదాపు అన్ని హోటల్స్ లో పులిహోర దోశ లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఉగ్గాని బజ్జి.. ఎంత ఫేమసో.. గుంటూరు పులిహోర దోశ కూడా అంతే ఫేమస్. ప్రతిరోజు ఇక్కడ ఇడ్లీతో సమానంగా దోశలు విక్రయమవుతుంటాయి.