Ugadi 2022: ఉగాది.. ఇది మన తెలుగు సంవత్సరాది. ఎన్నో పండుగలున్నా.. తెలుగు ప్రజలకు ఉగాది అంటే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మన తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేది ఈనాడే. ఈరోజే మన భవిష్యత్ ఎలా ఉండబోతుందో జాతకాల్లో తెలుస్తుంది. ఈరోజు అందరూ రాశిఫలాలు తెలుసుకొని ఆ దిశగా సంవత్సరమంతా ప్లాన్ చేసుకుంటారు. ఈ ఏడాది వచ్చేది ‘శుభకృతు నామ సంవత్సరం’. పురణాల నుంచి ఉగాదిని మనం జరుపుకుంటూనే ఉన్నాం.. దీని వెనుక గొప్ప చరిత్ర కూడా ఉంది.

-ఉగాది పండుగ ఎలా పుట్టింది?
పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే ‘చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజునే సృష్టించాడని చెబుతున్నారు. ఈరోజు నుంచే ఈ లోకం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుడిని శ్రీమహావిష్ణువు మత్స్యవతారం ఎత్తి సంహరిస్తాడు. అంతేకాదు.. వేదాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ సందర్భంగానే ఉగాది పండుగను నాడు జరిపారని ప్రతీతి.
Also Read: Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ సుముఖమేనా?
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏటా చైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న శనివారం ఈ పండుగ జరుపుకుంటున్నారు.
ఇక ఉగాదినాడు జోతిష్యాన్ని అందరూ తెలుసుకుంటారు. తమ రాశి చక్రాల జాతకాలు, గ్రహాల స్థితిని అంచనావేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం.. నివారణలు పాటించడం వంటివి చేస్తారు. మరో రెండు రోజుల్లో ‘శుభకృతు’ నామ సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ రోజే భూలోకం ప్రారంభమైందని ప్రతీతి. అందుకే ఈరోజున కొత్త జీవితానికి నాందిగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటారు.

-ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటారు?
ఈ కాలంలో దొరికే అన్న కాయలతో పచ్చడి చేసుకోవడం దీని ఆనవాయితీ. మామిడికాయ, చింతపండు, వేపపువ్వు, బెల్లం, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్ని కలిపి షడ్రుచులుగా మిశ్రమం చేసి దాన్ని అందరికి పంచడం తెలిసిందే. ఉగాది పచ్చడిని ఆరగించి పంచాంగ శ్రవణం చేసి పనులు కూడా మొదలుపెడతారు. వ్యవసాయ దారులైతే పొలం వెళ్లి సాగుపని ప్రారంభిస్తారు.
ఉగాది పచ్చడికి ప్రత్యేకత ఉంటుంది. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, సుఖాల మేళవింపుకు తార్కాణంగా వీటిని చెబుతారు. పచ్చడికి మామిడి వగరు, బెల్లం తీపి, చింత పులపు, వేప చేదు, ఉప్పును కలిపి పచ్చడి తయారు చేస్తారు. దీన్ని ఇంటిల్లిపాది తాగుతారు. ఇంకా చుట్టుపక్కల వారికి కూడా ఉగాది పచ్చడి రుచి చూపిస్తుంటారు. దీంతో జీవితంలో అన్నింటిని సమంగా చూసుకుని ఎదగాలనే ఉద్దేశమే.

ఉగాది పచ్చడిలో ప్రధానంగా మామిడికాయ భాగమే ఎక్కువ. దీంతోనే రుచికి విలువ తెలుస్తుంది. మామిడిలో ఉండే వగరు జీవితంలో సవాళ్లు ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది. ఇక బెల్లం సంతోషానికి ప్రతీక. జీవితంలో సంతోషాలు కలగాలని చెబుతోంది. వేపపువ్వు కష్టాలను తెలుపుతోంది. మనకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తుంది. మిరపకాయలు మనలోని కోపానికి ప్రతీకగా నిలుస్తాయి. మనకు కోపం వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలని చెబుతాయి. ఇవన్నీ మనకు జీవితంలో ఎలా ఉండాలో సూచిస్తాయనడంలో సందేహం లేదు.
ఇంతటి విశిష్టత కలిగిన పండుగ కావడంతోనే తెలుగువారు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఊరు, వాడా సందడిలా కనిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగం శ్రవణం చేసి పనులు మొదలు పెడతారు. దీంతో ఏడాదంతా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తారు. ఇష్ట దైవాలను పూజించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాదిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
Also Read: AP High Court: బ్రేకింగ్: ఏపీలో 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష