Yash KGF2 Censor Report: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇప్పటికే `కేజీఎఫ్ 2′ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినీ లోకాన్ని ఒక ఊపు ఊపేసింది.

అయితే, తాజాగా `కేజీఎఫ్ 2′ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు గానూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాల 6 సెకన్లు ఉంది. ఇప్పటికే `కేజీఎఫ్ 1′ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో `కేజీఎఫ్ 2′ పై భారీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: Shriya Saran shocking comments on NTR Charan: ఎన్టీఆర్ – చరణ్ పై శ్రియ షాకింగ్ కామెంట్స్
అందుకు తగ్గట్టే `కేజీఎఫ్ 2′ ట్రైలర్ 109 మిలియన్ వ్యూస్ ను సాధించి.. సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడానికి దూసుకెళ్తూనే ఉంది. మొదటి 24 గంటల్లో `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ 109 మిలియన్ వ్యూస్ సాధించింది. పైగా ఈ ట్రైలర్ కు 24 గంటల్లో తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అలాగే తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను, మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ షాట్స్ అండ్ బిల్డప్ షాట్స్ అదిరిపోయాయి.

అందుకే.. ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎలాగూ మొదటి పార్ట్ బంపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ భారీ అంచనాలకు కారణం ఇదే. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు.
అన్నిటికిమించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గనులు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో మాఫియా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: Tiger Nageswara Rao Movie New Update: ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి క్రేజీ అప్ డేట్
[…] Alia Bhatt: ‘ఆలియా భట్’ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత అనే కీలక పాత్రలో నటించి మెప్పించింది. పైగా సినిమా రిలీజ్ కి ముందు అలియా లుక్స్ అండ్ పోస్టర్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమాలో ఆమె పాత్రకు విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఓ దశలో ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ లో తనది చాలా కీలక పాత్ర అని ఫీల్ అయ్యింది. అందుకే.. ఆమె కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది. […]