https://oktelugu.com/

Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?

Minister Kodali Nani- Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి? ఎవరికి పదవులు ఇవ్వాలి? ఎవరితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్లు ఉంది. దీంతో కొడాలి నానిని సైతం మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ పదవి కట్టబెడతారనే తెలుస్తోంది. ఇన్నాళ్లు మంత్రిగా ఉండటంతోనే కాస్త కుదురుగా ఉన్నానని ఇక ఫ్రీ అయిపోయాక చంద్రబాబు పని చెబుతానని నాని గట్టిగా చెబుతున్నారు. దీంతో చంద్రబాబుపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 31, 2022 / 08:50 AM IST
    Follow us on

    Minister Kodali Nani- Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి? ఎవరికి పదవులు ఇవ్వాలి? ఎవరితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్లు ఉంది. దీంతో కొడాలి నానిని సైతం మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ పదవి కట్టబెడతారనే తెలుస్తోంది. ఇన్నాళ్లు మంత్రిగా ఉండటంతోనే కాస్త కుదురుగా ఉన్నానని ఇక ఫ్రీ అయిపోయాక చంద్రబాబు పని చెబుతానని నాని గట్టిగా చెబుతున్నారు. దీంతో చంద్రబాబుపై ప్రయోగించే అస్త్రంగా నాని మారతాడనే వాదనలు వస్తున్నాయి.

    Minister Kodali Nani- Chandrababu

    వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన నాని చంద్రబాబును తిట్టడంలో సిద్ధహస్తుడు. ఎక్కడైనా ఎప్పుడైనా బాబుపై ఒంటికాలి మీద లేచి నానా బూతులు తిట్టడంలో నేర్పరి. అందుకే తిట్టే బాధ్యతలను జగన్ నానికి అప్పగిస్తారనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నానిని మంత్రి పదవి నుంచి తొలగించి కృష్ణ, గుంటూరు రీజినల్ బాధ్యతలు అప్పగిస్తారనే సమాచారం వస్తోంది. దీంతో ఇక బాబుపై ప్రత్యక్షంగా పోరాటానికే నాని తయారుగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?

    వచ్చే ఎన్నికలకు పటిష్టమైన యంత్రాంగాన్ని తయారు చేసుకోవడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందుకే సమర్థులైన వారి సేవలు ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మంత్రివర్గ కూర్పులో కూడా తూకాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి టీం తయారు చేసుకుని మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది.

    నానికి నందమూరి వంశంతో కూడా మంచి సంబంధాలున్న నేపథ్యంలో నానిని పలు రకాలుగా వాడుకునేందుకు జగన్ రెడీ అయిపోయారు. అందుకే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి టీడీపీని దెబ్బకొట్టే విధంగా వాడేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నట్లు చెబుతున్నారు. అన్ని ఆలోచించే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ పగ్గాలు అప్పగించి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యతలను కట్టబెట్టేందుకు నిర్ణయించారు.

    Minister Kodali Nani- Chandrababu

    ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏ రంగంలో ఎవరు నిష్ణాతులో అలా వారి సేవలు వినియోగించుకుని పార్టీని గాడిలో పెట్టేందుకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో జగన్ రచిస్తున్న పాచికలతో పార్టీ మరోసారి గట్టెక్కేనా? లేక ప్రజావ్యతిరేక చర్యలకు దిగడంతో కనుమరుగయ్యేనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

    Also Read:Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి

    Tags