Loneliness
Loneliness: మనావుల జీవన పరిణామంలో అత్యంత కీలక దశ వృద్ధాప్యం. కుటుంబం బాధ్యతలు, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రశాంతత కోరుకునే సమయం. ఈ సమయంలో కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ మారుతున్న పరిస్థితులతో కలిసి ఉండలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఒకే అభిరుచి ఉన్నవారు కలిసి ఉండాలన్నదే కమ్యూనిటీ హోమ్స్. ఇందులో అన్నదమ్ములు, బావ, బావ మరుదులు, మిత్రులు ఎవరైనా కుటుంబాలు ఒక్కచోటే ఉండి బాధ్యతలు పంచుకోవడమే కమ్యూనిటీ హోమ్స్ ఉద్దేశం.
వృద్ధాశ్రమాలు..
ఇటీవల వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. ఎవరూ లేనివారు వృద్ధాశ్రమాల్లో ఉండడం తప్పు కాదు.. కానీ అందరూ ఉండి కూడా ఆశ్రమాల్లో ముక్కుమొహం తెలియనివారి మధ్య మలిసంధ్యలో జీవించడం చాలా నరకం. ఇక్కడ ఉండడానికి చాలామంది ఇష్టపడరు. కానీ పరిస్థితుల కారణంగా సర్దుకుపోతున్నారు. కానీ ప్రతీరోజు నరకంగా భావిస్తారు.
ఒక్కచోట ఉంటే సంతోషం..
కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉండాల్సి వస్తే అలాంటి పరిస్థితుల్లో బంధువులు, మిత్రులను పోగేసి కమ్యూనిటీని రెడీ చేసుకోవాలి. అందరూ ఒకేచోట ఉంటే ఆనందంగా గడుపుతారు. దగ్గరి బంధువులు అంతా కలిసి ఉంటే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. దగ్గరి బంధువులు, మిత్రులు అయితే ఇంకా మంచిది. అన్నింటికన్నా ఉత్తమం ఫ్యామిటీ ఫ్రెండ్స్ ఒకచోట ఉండడం. ఇలాంటి అందరూ ఒకే ఇల్లు అద్దెకు తీసుకుని, లేదా సొంత ఇంటిని మార్చుకుని కలిసి జీవించాలి. ఇక్కడ అన్నీ షేర్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
షేరింగ్.. కేరింగ్
ఒకే అభిరుచి కలిగినవారు ఒక్కచోట జీవించడం, పండుగలు చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడ,ం సర్ది చెప్పుకునే అవకాశం కారణంగా మనోవ్యథ తగ్గుతుంది. పిల్లలు దగ్గర లేరన్న బాధ తగ్గుతుంది. ఒకరిపై ఒకరికి కేరింగ్ పెరుగుతుంది. ఆహారం తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తమకు ఏదో జరుగుతుందన్న ఆందోళన ఉండదు.
ఒంటరితనం భయంకరం..
మనిషి సంఘజీవి. సమాజంలో కలిసి ఉండాలని కోరుకుంటాడు. ఒంటరిగా ఉంటే జైల్లో ఉన్నట్లు భావిస్తారు. ఆత్మన్యూనతా భావంతో ఇబ్బంది పడతారు. తమ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. తమను తాము నిందించుకోవడం, ఇతరులను నిందించడం మొదలు పెడతారు. సమస్యను ఎలా అధిగమించాలో తెలియక సతమతమవుతారు. ఒంటరితనం నరకంగా భావిస్తారు.
కలిసి ఉండకున్నా..
నేటి రోజుల్లో రెక్కలు వచ్చిన పిల్లలు ఎగిరిపోతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటున్నారు. తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మనసు కూడా పెద్దలు అర్థం చేసుకోవాలి. వారితో కలిసి ఉండకపోయినా బంధాన్ని కొనసాగించాలన్న భావన ఉండాలి. తమ వయసువారితో కలిసి ఉంటూ.. పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని, వారితో సత్సంబంధాలు కొనసాగించాలి. దీంతో వారు కూడా తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Loneliness distanced by communal living
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com