Hardik Pandya Prithvi shaw: భారత క్రికెట్‌లో కొన్ని నెలలుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి క్రికెట్ అభిమానులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. బీసీసీఐలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం, జట్టు ఎంపికలో పెర్ఫార్మెన్స్‌కంటే.. వ్యక్తిగతం, సాన్నిహిత్యానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో టీమిండియా ప్రదర్శన కూడా దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితిలో టీ20 జట్టు కెప్టెన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు సగటు క్రికెట్ అభిమానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ èæర్మ, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లతోపాటు వన్డే ప్రపంచకప్‌తోపాటు టెస్టు జట్టులో ఉన్న ప్లేయర్లు టీ20లకు దూరంగా ఉంటున్నారు. దీంంతో హార్దిక్ పాండ్యాను టీ20లకు సారథిగా బీసీసీఐ నియమించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సిద్ధం చేసే పనిలో కోచ్ ద్రవిడ్ ఉన్నాడు.

వరుస విజయాలు..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. ఐర్లాండ్‌పై నెగ్గిన భారత్.. ఆ తర్వాత కివీస్ పై.. శ్రీలంకలపై టీ20 సిరీస్‌లు నెగ్గింది. మళ్లీ ఇప్పుడు స్వదేశంలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. 21 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడింది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.
తన స్నేహితుల కోసం అలా చేశాడా..
టీ20 తుది జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన స్నేహితులకు మాత్రమే హార్దిక్ పాండ్యా తుది జట్టులో చోటు కల్పిస్తున్నాడంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. స్నేహితులైన శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడాలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రంజీల్లో రాణించి సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షాకు కూడా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అన్యాయం చేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు. సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడతాడని పృథ్వీ షాకు పేరుంది. అయితే అతడిని కాదని గిల్, ఇషాన్, దీపక్ హుడాలకు చోటు కల్పించడంపై క్రికెట్ లవర్స్ ఆగ్రహం చేస్తున్నారు.
గిల్‌పై విమర్శలను తిప్పికొడుతున్న ఫ్యాన్స్..
మరోవైపు శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవడంపై కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. గిల్ అభిమానులు వాటిని తిప్పికొడుతున్నారు. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అటువంటి గిల్ ఒక్క మ్యాచ్‌లో ఆడకపోయినంత మాత్రన విమర్శించడం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు. గిల్, ఇషాన్ కిషన్ కూడా జట్టులోకి ఎంపిక కాగానే అవకాశాలు రాలేదనే సంగతిని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.
మంచి ఫామ్‌లో ఉన్న గిల్, ఇషాన్ కిషన్‌ను తుది జట్టులో ఆడించాలి. అయితే దీపక్ హుడాను ఎందుకు కొనసాగిస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు. తొలి టీ20లో భారత్ నలుగురు సీమర్లు(హార్దిక్ ను కలుపుకుని).. ముగ్గురు స్పిన్నర్లు (కుల్దీప్, దీపక్, సుందర్)తో బరిలోకి దిగింది. టీ20ల్లో ఆరుగురు బౌలర్లతో దిగితే సరిపోయేది. దీపక్ హుడా స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇచ్చి ఉంటే భారత బ్యాటింగ్ మరింత బలంగా ఉండేది. మరి ఆదివారం జరిగే రెండో టీ20లో ఈ తప్పును హార్దిక్ సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.