Toxic family member: కుటుంబ జీవితం ప్రారంభమైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. కష్టసుఖాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే మిగతా విషయాలను పక్కన పెడితే బంధాల విషయంలో కొందరు చాలా కర్కోటకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న కొందరు వ్యక్తులు తమ గురించి గానీ.. తమ వాళ్ల గురించి గానీ మాట్లాడకుండా.. ఎదుటివారి గురించి ప్రతి విషయంలో తప్పులు తీస్తూ ఉంటారు. ఎదుటివారు ఏ చిన్న తప్పు చేసిన దానిని పెద్దగా చూపిస్తూ ఉంటారు. వారు చేసే తప్పును మాత్రం వెంటనే మర్చిపోయాలా చేస్తారు. ఇలాంటివారిని ఏమంటారు? వీరితో జీవనం ఎలా ఉంటుంది?
Also Read: ఇంటర్నెట్ విప్లవం.. సెకనులో నెట్‌ఫ్లిక్స్ డౌన్‌లోడ్!
కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. సమాజంలో మంచివారు, చెడ్డవారు అనే రెండు రకాల మనుషులు ఉన్నారు. వీరిలో ఎవరితో స్నేహం చేయాలి? అనే విషయాన్ని ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారితో స్నేహం చేసే సమయంలో.. వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే దానిని సరిదిద్దుకోవచ్చు. కానీ అతనికి ఉండే గుణం ఎప్పటికీ మారదు. అందువల్ల అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అతనితో జీవితం కొనసాగించాలి. ఎదుటివారి వ్యక్తిత్వ విషయంలో ఒకటి ఉదాహరణ తీసుకుందాం..
ఇద్దరు అన్నదమ్ములు ఒక కుటుంబంలో జీవిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఒకరు తమ పిల్లల గురించి పెద్దగా చర్చించారు. కానీ ఎదుటివారి పిల్లల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. వేరే వాళ్లతో మాట్లాడే సమయంలో కూడా వాళ్ల గురించే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వారి పెళ్లిళ్ల విషయానికి వచ్చేసరికి బ్యాడ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల తమకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ ఇలాంటి వారివల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే సాధారణంగా కొన్ని జంతువులకు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే విషం ఉంటుంది. ఇలా మాట్లాడే వారికి నిలువెల్లా విషయమే ఉంటుందని.. వారితో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వీరితో స్నేహం చేయాల్సి వచ్చినా.. వారికి రహస్యాలు చెప్పకుండా ఉండడమే మంచిది. అంతేకాకుండా వారు ఎదుటివారి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే.. ఆ విషయాన్ని పక్కదో పట్టించాలి. అప్పుడే ఆ పాపం విన్న వాళ్లకు కూడా చుట్టుకోకుండా ఉంటుంది అని అంటున్నారు.అంటే వీరు తమ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ఎదుటివారి జీవితం గురించి ఆలోచిస్తూనే గడిపేస్తుంటారు. ఈ క్రమంలో వారికి తెలియకుండానే వారు అనేక తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల వారు కూడా ఎప్పటికైనా ప్రమాదంలోనే పడతారు. అయితే ఆ విషయం తెలుసుకునేసరికి ఆలస్యం కావచ్చు. ఒకవేళ దీనిని ఎవరైనా గుర్తిస్తే వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. అయినా కూడా మారకపోతే విడిచి పెట్టాలి. ఎందుకంటే కొందరు తమ తప్పును ఎదుటి వాళ్ళు ఎత్తిచూపితే అసలు ఒప్పుకోరు. కానీ వారికి శిక్ష పడే సమయానికి తెలుసుకుంటారు. అయితే అప్పటికే సమయం మించిపోతుంది. అందువల్ల ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.