https://oktelugu.com/

Top Up Loan: బ్యాంకు టాప్ అప్ లోన్.. ఇది ఎవరికి ఇస్తారు? దీంతో అప్పులన్నీ తొలగించుకోవచ్చా?

ఒకప్పుడు అప్పుడు అవసరం ఉండే వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లేవాళ్లు. వ్యక్తులు అసవరాలను బట్టి వారు ఇష్టమొచ్చినట్లు వడ్డీని విధించేవారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2024 3:24 pm
    Top Up Loan

    Top Up Loan

    Follow us on

    Top Up Loan: కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం ఆశించినంత రావడం లేదు. ఒక్కోసారి ప్రత్యేక అవసరాలు ఏర్పడడంతో నగదు అవసరం ఉండి.. ఇతరులను అప్పుడు అడగాల్సి వస్తోంది. ఈ సమయంలో కొందరు 36 శాతం వడ్డీని విధిస్తూ అప్పులు ఇస్తుంటారు. అయితే ఇవి తీసుకున్నప్పుడు బాగానే ఉన్నా.. కట్టేటప్పుడు మాత్రం బాధేస్తుంది. ఈ అప్పుు తీర్చలేక చాలా మంది స్తిరాస్థులను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే ఎంత పెద్ద అప్పు అయినా చిన్న ప్రణాళికతో తీర్చవచ్చు. వడ్డీ వ్యాపారుల కంటే బ్యాంకులో తీసుకునే రుణంపై వడ్డీ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులో ఒకసారి చేసిన అప్పుపై మరో అప్పును కూడా తీసుకోవచ్చని తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం..

    ఒకప్పుడు అప్పుడు అవసరం ఉండే వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లేవాళ్లు. వ్యక్తులు అసవరాలను బట్టి వారు ఇష్టమొచ్చినట్లు వడ్డీని విధించేవారు. కానీ రాను రాను బ్యాంకులు వ్యక్తిగత లోన్లు ఇస్తున్నాయి. ఖాతాదారుని ట్రాన్జాక్షన్ ను బట్టి వారికి అవసరాలకు నగదును అందించి సాయం చేస్తుంది. ఒక్కోసారి అత్యవసర సమయాల్లో బ్యాంకు నుంచి రుణం రాకపోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే బ్యాంకు రుణం తీసుకుంటే మరోసారి రుణం ఇస్తారో లేదోననే సందేహం ఉంటుంది. కానీ ఒకసారి తీసుకున్న అప్పుపై మరో రుణాన్ని కూడా తీసుకోవచ్చు.

    ఉదాహరణకు ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారుల వద్ద 36 శాతం వడ్డీతో రూ.5 లక్షలు అప్పు చేశాడు. అతను అప్పటికే బ్యాంకులో హోం లోన్ తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారీ వద్ద తీసుకున్న అప్పు కంటే హోం లోన్ వడ్డీ చాలా తక్కువ. కానీ వడ్డీ వ్యాపారి బాధ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఆలోచించసాగాడు. అంతేకాకుండా అతనికి తక్కువ వడ్డీతో మరో అప్పు ఇస్తే నెలనెలా ఈఎంఐ కట్టగలిగే శక్తి కూడా ఉంది.

    ఇలాంటప్పుడు హోం లోన్ తీసుకున్న బ్యాంకును సంప్రదిస్తే దానిపై టాప్ అప్ లోన్ ఇస్తారు. అంటే అప్పటికే రూ.20 లక్షల గృహ రుణం తీసుకున్నా.. దానిపై ఎంత అర్హత ఉంటుందో అంత వరకు రుణం ఇవ్వగలుగుతారు. అప్పుడు ఈ రుణం తీసుకొని వడ్డీ వ్యాపరులకు కట్డేయడం వల్ల పెద్ద భారం తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పును తొలగించుకునేందుకు టాప్ అప్ లోన్ గురించి ఇప్పుడే బ్యాంకును సంప్రదించండి.