Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: బస్ లో వెళుతూ ఇంత పెద్ద కార్లు ఎలా కొంటారు అనుకునేవాడిని... విజయ్...

Vijay Devarakonda: బస్ లో వెళుతూ ఇంత పెద్ద కార్లు ఎలా కొంటారు అనుకునేవాడిని… విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కష్టాలు!

Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్యక్రమాల్లో సందడి చేశాడు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైతం ఈ చిత్ర ప్రమోషన్స్ ని సీరియస్ గా తీసుకుంది. వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తించారు ఈ జంట. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మిడిల్ క్లాస్ యువకుడు పాత్ర చేశాడు. అమ్మాయి లిఫ్ట్ ఇవ్వమని కోరితే… పెట్రోల్ కొట్టిస్తావా అనే రకం అన్నమాట.

అయితే నిజ జీవితంలో కూడా తాను అలాంటివాడినే అంటున్నాడు విజయ్ దేవరకొండ. మిడిల్ క్లాస్ కష్టాలు నాకు తెలుసని అన్నారు. పెళ్లి చూపులు చిత్రం విడుదలయ్యే వరకు తన బైక్ లో పెట్రోల్ మీటర్ ఎప్ప్పుడూ రెడ్ మీదే ఉండేదట. పెళ్లి చూపులు తర్వాత బైక్ ఫుల్ ట్యాంక్ చేయించానని అన్నాడు. అలాగే బస్ లో ప్రయాణం చేస్తూ రోడ్డు మీద వెళ్లే లగ్జరీ కార్లను చూసి… వీళ్ళు ఇంతింత పెద్ద కార్లు ఎలా కొంటున్నారు అనుకునేవాడట.

ఫ్యామిలీ స్టార్ మూవీలో నేను చేసిన గోవర్థన్ పాత్ర ఒకప్పటి నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు. అయితే విజయ్ దేవరకొండ కామెంట్స్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ సింపతీ కోసం చేస్తున్న కామెంట్స్. నిజానికి విజయ్ దేవరకొండ అంత పూర్ ఏం కాదు అంటున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అమెరికాలో జాబ్ చేసేవాడు.

విజయ్ దేవరకొండ తల్లి ఓ సందర్భంలో మాది దొరల కుటుంబం. మా అబ్బాయి మిడిల్ క్లాస్ రోల్ చేస్తే చూడలేకపోయాను అన్నారు. తమ్ముడు అమెరికాలో జాబ్ చేస్తుంటే… విజయ్ దేవరకొండకు కనీసం పెట్రోల్ కి డబ్బులు లేవు అంటే నమ్మడం ఎలా అంటున్నారు. ఈ ట్రోల్స్ పై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఆ విషయం పక్కన పెడితే… ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుంది. దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ తెరకెక్కించాడు. గోపి సుందర్ సంగీతం అందించాడు. ఫ్యామిలీ స్టార్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.

Exit mobile version