New-Car
Best Car: ఒకప్పుుడు ఫ్యామిలీతో కలిసి దూర ప్రయాణాలు చేయాలంటే బస్సులే ఆధారం. ఆ తరువాత ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని వెళ్లారు. కానీ ఈ మధ్య కాలంలో సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే.. బయటికి వెళ్లాల్సి వస్తే.. సొంత కారులో వెళ్లవచ్చని అనుకుంటున్నారు. దీంతో ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే 7 సీటర్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల 7 సీటర్ కార్లు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీల Renault కంపెనీకి చెందిన ఓ కారు 7 సీటర్ వేరియంట్ లో ఆకట్టు కుంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు అమ్మకాలు కూడా పెరిగాయి. మరి ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
Renault కంపెనీకి చెందిన Triber గురించి వాహనదారులకు తెలిసే ఉంటుంది. అయితే దీనిని ఇటీవలే కొత్త వెర్షన్ ను విడుదల చేశారు. ఈ మధ్య వినియోగదారులు ఎక్కువగా MPV కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ వేరియంట్ లో రెనాల్ట్ ట్రైబర్ కారుకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. 2025 ఫిబ్రవరి నెల ప్రకారం.. లెక్కలను చూస్తే ఈ కారును 1,545 మంది కొనుగోలు చేశారు. ఇదే కారును గత ఏడాది ఫిబ్రవరిలో 1,456 యూనిట్ల విక్రయాలు జరిగాయి. వార్షికంగా ఈ కారు 5.76 శాతం వృద్ధి సాధించింది. అయితే ఈ కారు డిజైన్ తో పాటు ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే రెనాల్ట్ నుంచి మార్కెట్లోకి వచ్చి ట్రైబర్ ను వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు కొత్త వెర్షన్ రావడంతో దీని సేల్స్ మరింతగా పెరిగాయి. అయితే ఈ ఏడాది చివరిలో ఈ కారును మరోసారి రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ కారు రూ. 6.10 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.8.75 లక్షలుగా ఉంది. లో బడ్జెట్ లో 7 సీటర్ కారును కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ కోసం ఈ కారు అనుగుణంగా ఉంటుందని అంటున్నారు.
ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. 71.01 బీహెచ్ పీ పవర్ తో పాటు 96 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి ఈ కారు 18.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 20.32 టచ్ స్క్రీన్ మీడియాను పొందవచ్చు. అలాగే వైర్ లెస్ ఛార్జర్, ఆటో కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 17.78 ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అమర్చారు. 84 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగిన ఈ కారు సేప్టీలో 4 స్టార్ రేటింగ్ పొందింది.