Lunar Eclipse 2022: నేడు చంద్రగ్రహణం సంభవించనుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డం వస్తుంది. దీంతో చంద్రగ్రహణం పడుతుందని చెబుతారు. ఈ గ్రహణం ఈసారి మధ్యాహ్నం పూటే రావడంతో కొన్ని ప్రాంతాలలోనే కనిపిస్తుంది. చంద్ర గ్రహణం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వాస్తు పండితులు సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సాయంత్రం 5.32 గంటలకు ప్రారంభమై 6.18 గంటలకు ముగుస్తుందని చెబుతున్నారు.

మొత్తం చంద్రగ్రహణం వ్యవధి ఒక గంట ఇరవై నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల పాటు ఏర్పడనుంది. దీంతో చంద్రగ్రహణం సందర్భంగా గర్భణులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వాస్తు పండితులు సూచనలు చేస్తున్నారు. భారతదేశంలోని ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, కలకత్తా, పాట్నా, రాంచీ, గౌహతి, సిలిగురి తదితర నగరాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఖాట్మండ్, టోక్యో, మనీలా, జకార్తా, మెల్ బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, బీజింగ్, సిడ్నీ, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో, మెక్సికో నగరాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని చెబుతున్నారు.
గ్రహణ సమయంలో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏ పని చేయకూడదు. పదునైన వస్తువులు తాకకూడదు. నెగెటివ్ ప్రభావం ఉన్నందున వారు ఆహారం తీసుకోకూడదు. గ్రహణానికి ముందు కాలాన్ని సూతక కాలమని చెబుతారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఎలాంటి వస్తువులను కూడా కట్ చేయకూడదు. ఆకలిగా అనిపిస్తే పండ్లు వంటి వాటిని ఆహారంగా తీసుకోవచ్చు.

గ్రహణం సమయంలో పంచదార, తెల్లని వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఇవి దానం చేయడం వల్ల శ్రేయస్కరం. ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఈ దానాలు చేయాల్సిందే. పాలు లేదా అన్నం దానం చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇలా దానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వెండి నాణెం దానం చేస్తే అనారోగ్యాలు దూరం అవుతాయి. గాజు పాత్రలో నీరు పోసి అందులో వెండినాణెం వేయండి. జబ్బుపడిన వ్యక్తి నీళ్లతో నిండిన గిన్నెలో ముఖం చూసుకోవాలి. గిన్నెను కూడా దానం చేయాలి. ఇలా చేస్తే ప్రయోజనం కలుగుతుంది.
చంద్రగ్రహణ సమయంలో నూనె రాసుకోకూడదు. ఆహారం తీసుకోకూడదు. పట్టువిడుపు తరువాత స్నానం చేసి ఆహారాలు తీసుకోవాలి.