Success: కష్టపడకుండా విజయం సాధించడం కష్టం. కాదు కాదు కష్టపడకుండా విజయం రాదు. స్మార్ట్ వర్క్ అయినా హార్డ్ వర్క్ అయినా సరే కచ్చితంగా చేయాల్సిందే. అప్పుడు మాత్రమే విజయం మిమ్మల్ని వరిస్తుంది. విజయవంతమైన వ్యక్తులందరి జీవితాన్ని గమనిస్తే వారు కొన్ని నియమాలను పాటిస్తుంటారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇలాంటి కొన్ని ఆలోచనల విషయంలో జాగ్రత్తగా కూడా ఉంటారు. కాబట్టి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఈ నియమాలను పాటించాలి అంటున్నారు నిపుణులు.
* రహస్యాలు: కొందరికి అన్నీ విషయాలను చెప్పే అలవాటు ఎక్కువ ఉంటుంది. అయితే విజయం సాధించాలనుకునే వారు గోప్యత పాటించడం చాలా అవసరం. కొన్ని ఆలోచనల గురించి ఎవరికీ చెప్పవద్దు. మీరు నిర్ణయించుకున్నది చేసేయాలి. కానీ రివీల్ మాత్రం చేయవద్దు. కేవలం వ్యక్తిగత సమాచారం తెలిపితే సరిపోతుంది. కొన్ని సార్లు అది కూడా అవసరం లేదు. ఇలా చేస్తే మీ విజయానికి దారి పడ్డట్టే.
* ఇతరుల అభిప్రాయాలు: జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా ఇతరుల అభిప్రాయాలను ఎక్కువ పరిగణలోకి తీసుకోవద్దు. వారి మాటలు, కొన్ని అనవసరమైన సలహాల వల్ల సమయం వృధా అవుతుంది. అంతేకాదు మీకుఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అంతేకాదు కొన్ని సార్లు మీ విజయాన్ని తట్టుకోలేకపోతున్నారని మీరు కూడా అనుకుంటారు. సో శతుత్ర్వం పెరుగుతుంది.
* వ్యక్తిగత నిర్ణయాలు: ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన నిర్ణయాలు ప్రతి ఒక్కరు తీసుకుంటారు. కానీ ఈ నిర్ణయాలలో గురించి కొన్ని సార్లు చర్చించకపోవడమే బెటర్. కొన్నిసార్లు మీ నిర్ణయం మీవరకు సరైనదే అయినా ఇతరుల అభిప్రాయాలు సరిగ్గా ఉండకపోవచ్చు. సో మీకు అలజడి మొదలు అవుతుంది.
* ఆరోగ్యం పట్ల శ్రద్ధ: అనుకున్నది సాధించాలనే తొందరలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం కంటే మించినది గొప్ప సిరి సంపద కాదు అని గమనించండి. మీరు సక్సెస్ సాధించే సమయానికి ఆరోగ్యం అనుకూలించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆరోగ్యం జాగ్రత్త. దీనికోసం సరైన డైట్, భోజనం, స్నాక్స్, నిద్ర , విశ్రాంతి వంటి మీద శ్రద్ధ వహించండి.
* అదృష్టం మీద ఆధారపడడం : కొంతమంది అదృష్టం మీద ఆధారపడి పని మొదలు పెడతారు. అయితే ఈ అదృష్టం అన్ని వేళలా మీ వెంట ఉండదు అని గమనించండి. కష్టపడి పనిచేయడం మాత్రమే విజయానికి ప్రాథమిక నియమం. అదృష్టం వంటివి తదుపరివి అని గుర్తు పెట్టుకోండి. ఈ అదృష్టం లేకున్నా మీరు కష్టపడి పనిచేస్తే, ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది అని తెలుసుకోండి..
* వేరొకరి అనుమతి, నిర్ణయం: మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో, కష్టపడి చేయడం మాత్రమే మ పని. మరొకరి అనుమతి, నిర్ణయం కోసం వెయిట్ చేయవద్దు. ఇది మీ నిర్ణయాలలో , ఇతరుల నిర్ణయాలతో పోలిస్తే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దీని వల్ల సమయం వృధా అవుతుంది.