30 ప్లస్ లోనూ అందంగా ఉండాలంటే ఇలా చేయాలి..

ప్రతిరోజూ తీసుకునే ఆహారం అందంపై ప్రభావం పడుతుందంటే కొందరు నమ్మరు. నిత్య యవ్వనం కోసం కొన్ని ప్రత్యేక పదార్థాలు తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : May 14, 2024 2:48 pm

Beauty Tips

Follow us on

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవారు అందం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తారు. అందంగా ఉన్నామని తెలిస్తే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు కదులుతారు. సమాజంలో గుర్తింపు ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ అందం తగ్గడం సహజం. యువతులు అందంగా ఉంటారు. కానీ 30 ఏళ్ల తరువాత కొన్ని కారణాల వల్ల అందం తరిగిపోతుంది. కానీ కొన్ని చర్యల వల్ల నిత్యం అందంగా ఉండొచ్చు. వాతావరణం ఎలా ఉన్నా వీటి ద్వారా అందమైన మొహంతో బయటకు వెళ్లొచ్చు.

  • ప్రతిరోజూ తీసుకునే ఆహారం అందంపై ప్రభావం పడుతుందంటే కొందరు నమ్మరు. నిత్య యవ్వనం కోసం కొన్ని ప్రత్యేక పదార్థాలు తీసుకోవాలి. సాధారణ ఆహారం కాకుండా సలాడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంచుతాయి. దీంతో బరువు పెరగకుండా స్లిమ్ గా ఉంటారు. ఫలితంగా మోహం స్కీన్ కూడా ముడతలు రాకుండా ఉంటాయి.
  • అందాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కడా కొవ్వు పేరుకుపోకుండా యాక్టివ్ గా ఉంటారు. అయితే వర్కౌట్ల పేరిట ఎక్కువగా శ్రమ పడకుండా సాధారణ వ్యాయామం చేసినా సరిపోతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం వాకింగ్ చేసినా సరిపోతుంది.
  • సమ్మర్ లో ఎక్కువగా బయట తిరగడం వల్ల స్కిన్ పాడైపోతుంది. ఇలాంటి సమయంలో సన్ క్రీములు వాడొచ్చు. వీటిని అప్లై చేసి బయటకు వెళ్లడం ద్వారా ఎండ వేడి స్కిన్ పై పడదు. దీంతో చర్మం ఎప్పటిలాగే కాంతివంతంగా ఉంటుంది. వీటితో పాటు అప్పుడప్పుడు మాయిశ్చరైజేషన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
  • ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల అందంగా ఉండగలుగుతారు. కొన్ని పనుల నిమిత్తం బిజీ లైఫ్ లో పడి చాలా మంది సరైన నీరు తీసుకోవడం లేదు. అయితే ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యంలో ఉండి రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో అందంగా ఉండగలుగుతారు.