Young People Mistakes: కాలం మారుతున్న కొద్ది సాంకేతికం అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి సమయంలో ఒకప్పుడు కష్టంగా చేసిన పనులను ఇప్పుడు సులువుగా పూర్తి చేస్తున్నారు. అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సంతోషపడాలో.. దుఃఖించాలో అర్థం కావడం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్ది ఆందోళన ఎక్కువ కావడమే కానీ తగ్గడం లేదు. గతంలో ఆహారం, ఆరోగ్యం కోసం ఆందోళన ఉంటే.. ఇప్పుడు డబ్బు కోసం కష్టపడుతున్నారు. అయితే ఇందులో యువత ఎక్కువగా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. అనుకున్న స్థాయిలో డబ్బు పొందేవారు సైతం మనశ్శాంతి లేకపోవడం చూస్తే వారు చేసే కొన్ని పొరపాట్లే అని అర్థమవుతుంది. ఆ పొరపాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు ఒక ఉద్యోగికి రూ. 10,000 లోపు ఆదాయం వచ్చేది. ఈ ఆదాయంలో అతడు ఎంతో సంతోషంగా ఉండగలిగాడు. కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడిపాడు. కానీ ఆ ఆదాయం కంటే ఇప్పుడు అది రేట్లు ఎక్కువగా పొందుతున్నారు. మరి ఆదాయం పెరిగినప్పుడు సంతోషం అంటే దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఏమిటంటే ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. యువత తమకు వచ్చే ఆదాయాన్ని సరైన విధంగా పంపిణీ చేయకపోవడంతో కష్టాల పాలవుతున్నారని చెబుతున్నారు.
ఒక యువకుడు లేదా యువతికి 30 ఏళ్లలోపు ఉద్యోగం వస్తే.. తనకు కనీసం లక్ష రూపాయల వరకు జీతం ఉంటే.. అందులో ఎక్కువ శాతం ఈఎంఐ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగం లోకి చేరిన వెంటనే ముందుగా ఇల్లు లేదా కారును కొనుగోలు చేస్తున్నారు. ఇలా ముందుగానే వాటిని కొనుగోలు చేసి ఈఎంఐ లలో పెట్టుకుని వచ్చిన ఆదాయంలో సగం వరకు వాటికి వెచ్చిస్తున్నారు. అయితే చాలామంది తమకు అవసరం లేకుండా కూడా ఇతరులను చూసి ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు తమ స్నేహితులకు లేదా తోలి ఉద్యోగులకు కారు ఉందని.. తమకు లేదని గిల్టీ ఫీలింగ్ తో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇలా అవసరం లేకున్నా వాటిని కొనుగోలు చేయడం వల్ల వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఈఎంఐ లకు వెళ్ళిపోతుంది. దీంతో సాధారణ జీవితం గడపడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది.
ఇలా చేయడం వల్ల ఎప్పటికీ మనశ్శాంతిని పొందలేకపోతున్నారు. కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం యువత తమకు వచ్చే ఆదాయంలో 50% మాత్రమే ఈఎంఐ లను ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా అత్యవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తే మాత్రమే. కొన్నాళ్లపాటు ఆదాయం పెరిగిన తర్వాత అప్పుడు వస్తువుల కొనుగోలు గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు శాశ్వతం అని ఎవరు చెప్పలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగం ఓడిపోతే అప్పుడు మరింత బాధ పడాల్సి వస్తుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు తమకు వచ్చే ఆదాయంలో సొంతంగా పొదుపు చేసుకొని ఆ తర్వాత వస్తువుల గురించి ఆలోచించాలి. లేకుంటే ప్రతిరోజు కష్టంగానే గెలుస్తుంది.