Relationship: అమ్మాయిలు వారిని అర్థం చేసుకుని బాగా చూసుకునే భాగస్వామి (Partner) రావాలని కోరుకుంటారు. అన్ని విధాలుగా తమని సపోర్ట్ చేసే అబ్బాయి (Boy) తన లైఫ్ లోకి వస్తే జీవితం (Life) సాఫీగా సాగుతుందని చాలా మంది భావిస్తారు. అయితే కోరుకున్న విధంగా భాగస్వామి (Partner) రాకపోయినా పర్లేదు. కానీ అర్థం చేసుకునే భాగస్వామి జీవితంలోకి రాకపోతే మాత్రం వారంతా నరకం ఇంకా ఎవరికీ ఉండదు. అయితే పెళ్లి చేసుకునే ముందు అన్ని విషయాలను చూసి చేసుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలను అయితే ముఖం నుంచి కాలి పాదాల వరకు అన్నింటిని గమనిస్తారు. అమ్మాయి కాలి వేలు పొడవుగా ఉంటే మాత్రం ఆమెను అసలు వివాహం (Marriage) చేసుకోరు. అయితే కేవలం అమ్మాయిలు (Girls) అనే కాకుండా పురుషుల పాదాలను బట్టి కూడా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఒక్కోరి పాదం ఒక్కోలా ఉంటుంది. అయితే ఎలాంటి పాదం ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
సాధారణంగా కొందరు అబ్బాయిల పాదాలు పెద్దగా ఉంటాయి. ఇలా పాదాలు పెద్దగా ఉన్నవారు తన భాగస్వామిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు వేలకు మందికి పైగా పురుషులను అధ్యయనం చేసి ఈ విషయాన్ని నిపుణులు తెలియజేశారు. పాదాలు 10 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్న పురుషులు తమ భాగస్వాములను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ సర్వే వెల్లడించింది. అయితే కొందరు ఈ సర్వేని ఖండించారు. అయితే మన దేశంలో చాలా మంది జాతకాలను ఫాలో అవుతుంటారు. భాగస్వాములు జాతకాలు కలిస్తే సంతోషంగా ఉంటారని లేకపోతే ఉండరని భావిస్తారు. అయితే ఇవన్నీ కొందరి అభిప్రాయాలు, నమ్మకాలు మాత్రమే. ఎందుకంటే భార్యాభర్తలు ఎలాంటి అపోహలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. అంతే కానీ జాతకం, ఇతరులు ఏదో చెప్పారని పాటించకూడదని కొందరు అంటున్నారు.
ఏ బంధం అయినా కూడా సంతోషంగా ఎక్కువ కాలాల పాటు ఉండాలంటే మాత్రం ఇద్దరికి అర్థం చేసుకునే గుణం ఉండాలి. అబద్ధాలకు అసలు తావు ఇవ్వకూడదు. ఒకరి మాట మీద ఒకరికి గౌరవం, నమ్మకం, ప్రేమ ఉండాలి. అప్పుడే ఎక్కువ కాలం సంతోషంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది విడిపోతున్నారు. భాగస్వాములు అపార్థాలు క్రియేట్ చేసుకుని విడిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లయిన ఏడాదికే విడాకుల బాట పడుతున్నారు. మూఢ నమ్మకాలా లేకపోతే ఇతరులతో అక్రమ సంబంధాలు కూడా ఓ కారణమే. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. స్వచ్ఛమైన ప్రేమను వదులుకుంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.