AC Power Saving Tips: ఎండలు మండిపోతున్నాయి.. 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో బయటికి అంతే సంగతులు. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నా కూడా భరించలేని ఉక్కుపోత. దీనికి తోడు ఇంట్లో వేడిమి. ఇలాంటి అప్పుడు దేహాన్ని చల్లబరుచుకోవాలని చాలామంది చూస్తారు.. ఫ్యాన్ వేస్తే అది కూడా వేడిగాలి ఇస్తుంది. కూలర్ చల్లదనం కొంతవరకు ఉంటుంది. అదే ఏసీ అయితే గది మొత్తాన్ని చల్లగా ఉంచుతుంది. దేహాన్ని కూడా ఎండ వేడి నుంచి రక్షిస్తుంది. జనం చల్లదనం కోసం వెంపర్లాడుతున్నారు కాబట్టే ఏసీల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అయితే ఏసీలు వాడినంతసేపు బాగానే ఉంటాయి. చల్లని గాలిని ఇచ్చి శరీరానికి సాంత్వన చేకూర్చుతాయి. అయితే చాలామందిలో ఏసి వాడితే కరెంట్ బిల్లు అధికంగా వస్తుందనే భయం ఉంటుంది. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా టారిఫ్ చార్జీలు పెంచడంతో కరెంటు బిల్లులు మోతెక్కిపోతున్నాయి. ఇలాంటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలతో ఏసీ ని ఎక్కువకాలం నడిపించవచ్చని, అదే సమయంలో జేబుకు చిల్లుపెట్టే కరెంట్ బిల్లులను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి పాటించాల్సింది
ఏసి సాధారణ కానిస్టేబుల్ ఉష్ణోగ్రతను 18 డిగ్రీల వరకు తగ్గిస్తూ ఉంటారు. ఇలా తగ్గిస్తే ఇల్లు త్వరగా చల్లబడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఏసీ ఉష్ణోగ్రత 24 నుంచి 27 డిగ్రీ వరకు ఉండాలి అంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు.” ఏసీలను 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉపయోగించాలి. దీనివల్ల ఏసీలు ఎక్కువ రోజులు వస్తాయి. ఏసీలు వినియోగించే విద్యుత్ కూడా తగ్గుతుంది. 27° నుంచి ఒక్కో డిగ్రీ తగ్గిస్తూ వెనక్కి వెళ్ళినప్పుడు ఏసీ సామర్థ్యం సగటున మూడు నుంచి పది శాతం వరకు తగ్గుతుంది” అని సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ పరిశోధకుల పరిశోధనలో తేలింది. ” ఐదు స్టార్ల ఏసీ ని 50 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో నడిపించే దానికంటే, ఒక్క స్టార్ ఏసీ ని 27° తో నడిపిస్తే మెరుగ్గా పనిచేస్తుంది. మీ ఏసీ 18 డిగ్రీల దగ్గర నడిపిస్తున్నారు అంటే మీ ఇల్లు కూడా 18 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. 18 డిగ్రీల గది ఉష్ణోగ్రతకు రావాలంటే ఎంత సమయం పడుతుందో మీరే ఊహించుకోండి అంటూ” ఆ సంస్థ పరిశోధకులు అంటున్నారు.
ఇన్స్టాలేషన్లో జాగ్రత్తలు వహించాలి
గది విస్తీర్ణానికి తగినట్టుగా ఏసీ ని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మన గది విస్తీర్ణం 120 నుంచి 140 చదరపు అడుగుల వరకు ఉంటే ఒక టన్ ఏసీ తీసుకుంటే సరిపోతుంది.. అదే 150 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే గది కైతే 1.5 టన్ ఏసి వాడటం మంచిది. అంతకంటే ఎక్కువ అంటే 18 చదరపు అడుగులకు పై విస్తీర్ణం ఉంటే రెండు టన్నుల ఏసీ ని వాడాలి. చిన్న గదికి ఎక్కువ తన్నులు గుండె సామర్థ్యం ఉన్న ఏసీతో విద్యుత్ అదనంగా ఖర్చవుతుంది. అదే సమయంలో తక్కువ సామర్థ్యం ఉండే ఏసీలు పెద్ద గదులకు సరిపోవు. అందుకే ముందు మన ఇంటి పరిమాణం ఆధారంగా ఏసీ ని ఎంచుకోవాలి. గంట సమయంలో గది నుంచి ఏసీ తొలగించే వేడిగాలి సామర్థ్యాన్ని టన్నుల్లో కొలుస్తారు. ఎక్కువ టన్నుల సామర్థ్యం ఉండే ఏసి ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది.
ఎండలో పెట్టకూడదు
ఏసీ ని ఎండ తగిలేలా అమర్చడం వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అవుట్ డోర్ ఏసీ యూనిట్ లో కండెన్సర్ కాయిల్, కండెన్సర్ ఫ్యాన్ ఉంటాయి. బయట గాలిని కండెన్సర్ కాయిల్ ల్లోకి పంపించేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ కండెన్సర్ కాయిల్ మీద ఎండ పడితే గాలిని చల్లబరిచే ఏసి సామర్థ్యం తగ్గుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఏసీ పై నేరుగా ఎండ పడితే గదిలోని వేడిగాలిని చల్లబరిచే సామర్థ్యం తగ్గుతుంది. ఎండ తగలడం వల్ల గదిని చాలా పరిచేందుకు ఏసీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. వీలైనంతవరకు ఏసీ ని నేరుగా ఎండ తగిలేచోట అమరచకూడదు.
ఏడాదికి ఒకసారైనా ..
కనీసం ఏడాదికి ఒకసారైనా ఏసీ ని సర్వీసింగ్ కు ఇవ్వాలి.. దీనివల్ల వాటి సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లు, డక్స్ట్ లో దుమ్ము, ధూళి పేరుకుంటాయి. వీటిని తొలగించకపోతే ఏసీ సామర్థ్యం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఏసీలో గ్యాస్ లీక్ అయిపోతుంది. ఫలితంగా ఏసీని ఎంతసేపు నడిపించినప్పటికీ గది చల్లబడదు. సర్వీసింగ్ చేయించినప్పుడు గ్యాస్ ప్రెజర్ కూడా చెక్ చేయించుకోవాలి. ఒక్కోసారి కంప్రెసర్ ఆన్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అది ఆన్ అయినా చల్లగాలి రాదు. అలాంటప్పుడు దానిని సర్వీసింగ్ ఇవ్వాలి. అలా సర్వీసింగ్ కు ఇస్తే ఎక్కువ కాలం పనిచేస్తుంది.
టైమర్ పెట్టుకోవాలి
దాదాపు అన్ని ఏసీల్లోనూ టైమర్లు ఉంటున్నాయి. మన గది ఎంత సేపట్లో చల్లబడుతుందో గమనించి, ఆ సమయానికి టైమర్ పెట్టుకోవాలి. దీంతో ఏసి 24 గంటలూ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది. మనం మధ్య మధ్యలో ఏసిని ఆఫ్ చేయడం వల్ల ఏసీ భాగాలు చల్లబడతాయి. దీంతో మనం మళ్ళీ ఆన్ చేసేటప్పుడు ఏసీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. తలుపులు, కిటికీలు మూసే ఉంచాలి. చల్లగాలి బయటికి వెళ్లిపోకుండా ఇవి నిరోధిస్తాయి. దీనివల్ల కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు చాలా వరకు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల వాటిని రూమ్ బయట అమర్చడం వల్ల కొంతమేరకు ఉపయోగం ఉంటుంది.